కాశకృత్స్న వ్యాకరణము
కాశకృత్స్న వ్యాకరణము అనునది సంస్కృత వ్యాకరణం.[1]
విశేషాలు
మార్చుదానిని రచించినది కాశకృత్స్నుడో, కాశకృత్స్నియో. కవి కల్పద్రువ కాలము నందు బోపదేవగోస్వామి కాశకృత్స్నుడు ఆదిశాబ్దికుడని వ్రాసినాడు. కాశకృత్స్నుడు మీమాంసకుడని ప్రసిద్ధి. కాతీయసూత్రమునందు యాజ్నవల్క్య పుత్రుడు కాత్యాయనుడును, మహాభాష్యమున (4-1-14) పతంజలి డు ఇతనిని మీమాంసకుడని అన్నారు. కాశకృత్స్నుడే వ్యాకరణకర్త అని చెప్పవచును.[2] అష్టాధ్యాయి యందు ఇతని నామము కనబడకున్నను ఈతడు పాణిని కి తరువాతి వాడు కాడు. పారాశర్యశిలాలిభ్యాం భిక్షునటసూత్రయోః అను సూత్రమున పాణిని వ్యాసుడు నామము, వేదాంతసూత్రమును స్మరించినాడు. అవస్థితేరితి కాశకృత్స్న అను వేదాంతసూత్రమున వ్యాసభగవానుడు ఇతనిని స్మరించినాడు.[3] శ్రీభాష్యము న రామానుజాచార్యుడు పరశర్యుడే వ్యాసుడని సంబోధించినాడు. పాణిని వ్యాసుని పేర్కొన్నాడు, వ్యాసుడు కాశకృత్స్నుడుని పేర్కొన్నాడు. కావున ఇతడు వ్యాపాణినులకు పూర్వుడు అని అనుకొందురు. శతాచ్చ ఠన్యతావశతే అను సూత్రమును గూర్చి ప్రదీపమున కైయటాచార్యుడు ఆపిశల కాశకృత్స్నయో స్త్వగ్రంథ ఇతివచనా ద్ ప్యత్ర ప్రతిషేధాభావో నియతకాలాశ్చ స్మృతయో వ్యవస్థాహేతవ ఇతిమునిత్రయమతే నాద్యత్వే సాధ్వసాధుప్రవిభాగః అన్నాడు. ఇలా పలుచోట్ల ఈతని గూర్చి పలువురు పూర్వకవులు తెలిపినారు. అయినను పాణినీయ వ్యాకరణము పూర్వులగ్రంథములకంటే బలవత్తరమయిన దని పలువురు గ్రంథ కారుల అభిప్రాయము. పతంజలి కాశకృత్స్నవ్యాకరణమును జూచియుండవచ్చును; కాని భర్తృహరి చూచినాడో, లేదో తెలుపుట కష్టము. ఒకచోట తదర్హం ఇతి నారబ్ధం సూత్రం వ్యాకరణాంతరే అన్నాడు భర్తృహరి. దీనిపై వ్యాఖ్యవ్రాసిన హేలరాజు వ్యాకరణాంతరే కాశకృత్స్నే చాపిశలె అని వివరించినాడు.
ఈవ్యాకరణము మూడు అధ్యాయములగ్రంథము.ఈ వ్యాకరణమున మూడు,నాలుగు సూత్రములు మాత్రమే నేడు లభించుచున్నవి.
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- భారతి మాస సంచిక.