కాసవ్

సుమిత్రా భావే-సునీల్ సుఖ్తంకర్ దర్శకత్వంలో 2016లో విడుదలైన మరాఠీ సినిమా

కాసవ్, 2016 అక్టోబరు 6న విడుదలైన మరాఠీ సినిమా. సుమిత్రా భావే-సునీల్ సుఖ్తంకర్[1] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇరావతి హర్షే, అలోక్ రాజ్‌వాడే, మోహన్ అగాషే తదితరులు నటించారు. విచిత్ర నిర్మతి బ్యానరులో భావే-సుఖ్తంకర్ సహకారంతో మోహన్ అగాషే ఈ సినిమాను నిర్మించాడు.[2] ఈ సినిమా 64వ భాతర జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో గెలిచిన ఐదవ మరాఠీ చిత్రమిది.[3]

కాసవ్
కాసవ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసుమిత్రా భావే-సునీల్ సుఖ్తంకర్
రచనసుమిత్రా భావే (మాటలు)
స్క్రీన్ ప్లేసుమిత్రా భావే
కథసుమిత్రా భావే
నిర్మాతమోహన్ అగాషే
సుమిత్రా భావే
సునీల్ సుఖ్తంకర్
తారాగణంఇరావతి హర్షే
అలోక్ రాజ్‌వాడే
మోహన్ అగాషే
ఛాయాగ్రహణంధనంజయ్ కులకర్ణి
కూర్పుమోహిత్ తకాల్కర్
సంగీతంసాకేత్ కనెట్కర్
విడుదల తేదీ
2016 అక్టోబరు
సినిమా నిడివి
104 నిముషాలు
దేశంభారతదేశం
భాషమరాఠి

నటవర్గం

మార్చు
  • ఇరావతి హర్షే (జానకి)
  • అలోక్ రాజ్‌వాడే (మానవ్)
  • మోహన్ అగాషే (దత్తాభావు)
  • కిషోర్ కదమ్ (యదు)
  • దేవిక దఫ్తార్దార్
  • సంతోష్ రెడ్కర్
  • ఓంకర్ ఘాడీ

అవార్డులు, ప్రదర్శనలు

మార్చు

64వ భాతర జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు ( స్వర్ణ కమలం)ను గెలుచుకుంది.

ముంబై చలన చిత్రోత్సవం (2016), కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (2016), కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (2016), బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (2017), న్యూయార్క్ ఇండియన్ చలన చిత్రోత్సవం (2017) వంటి వివిధ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఈ సినిమా ప్రదర్శించబడింది. చైనాలో జరిగిన బ్రిక్స్ చలన చిత్రోత్సవం -2017లో అలోక్ రాజ్‌వాడే ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Paan Singh Tomar (2010)". Indiancine.ma. Retrieved 2021-06-24.
  2. "17th Annual New York Indian Film Festival". New York Indian Film Festival. Archived from the original on 2017-05-13. Retrieved 2021-06-24.
  3. Bhanage, Mihir (11 April 2017). "Kaasav and Ventilator's big win at the National Awards". The Times of India. Retrieved 2021-06-24.
  4. Mascarenhas, Anuradha (8 April 2017). "It's about helping beat depression with acceptance, love: Kaasav director Sumitra Bhave". The Indian Express. Retrieved 2021-06-24.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాసవ్&oldid=3828426" నుండి వెలికితీశారు