కాసుల పేరు (సినిమా)

కాసులపేరు 1938లో విడుదలైన తెలుగు సినిమా. ఆధ్రా సినీటోన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సి.పుల్లయ్య దర్శకత్వం వహించాడు. కాళ్ళకూరి హనుమంతరావు, సుందరమ్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టేకుమళ్ళ అత్యుతరావు సంగీతాన్నందించాడు.[1]

కాసుల పేరు
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం కాళ్ళకూరి హనుమంతరావు,
సుందరమ్మ,
శ్రీహరి,
తులశమ్మ
సంగీతం టేకుమళ్ళ అచ్యుతరావు
నిర్మాణ సంస్థ ఆంధ్రా సినీ టోన్
నిడివి 8000 అడుగుల రీలు
భాష తెలుగు
సి.పుల్లయ్య

పాత్రధారులు మార్చు

  • మదనగోపాలరావు పంతులు ;; కాళ్ళకూరి హనుజ్మంతరావు పంతులు
  • రుక్మినీ బాయమ్మ ...... సుందరమ్మ
  • తులశమ్మ ..... తులశమ్మ

కథ మార్చు

60 యేండ్ల వయస్సు గల మదనగోపాలరావు పంతులుకు లైంగిక వాంఛలపై ఆశక్తి ఎక్కువ. అతను తన ఇంటిని ఒకసారి సందర్శించిన ఒక పేద మంచి యువతి సుందరమ్మ పట్ల యిష్టం కలిగి ఉంటాడు. అతను తన వంట మనిషి ద్వారా ఒక ప్రేమ లేఖను సుందరమ్మకు పంచిస్తారు. ఆమెకు కాసుల పేరు ఇవ్వనున్నట్లు కబురు పంపిస్తాడు. ఆ పేద సుందరమ్మ ఈ విషయాన్ని అతని భర్త రుక్మిణీ బాయి అమ్మకు తెలియజేస్తుంది.

రుక్మిణీబాయి తన భర్తకు గుణపాఠం చెప్పాలనుకుంటుంది. ఆమె ప్రేమలేఖ తెచ్చిన వంటమనిషితో సుందరమ్మ అంగీకారం తెలియజేస్తున్నట్లు వర్తమానం పంపుతుంది. ఒక రోజు రాత్రి 10 గంటలకు కలుసుకోవాలని నిర్ణయించిన పంతులు ఒక మంచి కాసులపేరును కొని తెస్తాడు. రాత్రి కావడానికి ముందు అతను వేగంగా భోజనం ముగించి అందంగా అలంకారం చేసుకుంటాడు. కలుసు కోవాలనుకునే సమయంలో వితంతువు అతనిని ఒక చీకటి గదిలోకి పంపిస్తుంది. ఆ గదిలో పంతులు మంచంపై ముసుగు కప్పుకొని ఉన్న వ్యక్తిని చూస్తాడు. సుందరమ్మా, సుందరమ్మా అని పిలుస్తాడు. కానీ సమాధానం ఉండదు. కాసులపేరు తేనందుకు సుందరమ్మకు కోపం వచ్చిందని పంతులు భావిస్తాడు. మెల్లగా వెళ్ళి ముసుగు కప్పుకొని ఉన్న వ్యక్తి పై చేయి వేస్తాడు. అపుడు వితంతువు ఆ గదిలో దీపం వెలిగిస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి రుక్మిణీబాయమ్మ అని గుర్తిస్తాడు. ఆమె మెడలో కాసుల పేరు ఉంటుంది.

మూలాలు మార్చు

  1. "Kasula Peru (1938)". Indiancine.ma. Retrieved 2021-05-10.

బయటి లింకులు మార్చు