కిడారి సర్వేశ్వర రావు

కిడారి సర్వేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు,దివంగత ఎమ్మెల్యే.

కిడారి సర్వేశ్వర రావు
నియోజకవర్గం అరకులోయ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

మరణం 2018 సెప్టెంబరు 23
లివితిపుట్టు గ్రామం, డుంబ్రిగుడ మండలం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సంతానం కిడారి సందీప్, కిడారి శ్రావణ్ కుమార్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

కిడారి సర్వేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలం , గిన్నెలకోట గ్రామం గ్రామంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కిడారి సర్వేశ్వర రావు 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అరకు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సివేరు సోము పై 34053 ఓట్ల మెజారితో గెలిచాడు. ఆయన 28 ఏప్రిల్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లో చేరాడు.[1] టిడిపిలో చేరిన అనంతరం కిడారి సర్వేశ్వర రావు కు ప్రభుత్వ విప్ గా ప్రభుత్వం నియమించింది.

మరణం మార్చు

కిడారి సర్వేశ్వర రావు 23 సెప్టెంబరు 2018లో న అరకులో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతూ, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలం, వితిపుట్టు గ్రామంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురై మరణించాడు.[2][3]ఆయన మరణాంతరం ఆయన పెద్ద కుమారుడు సందీప్ కుమార్‌కు గ్రూప్ 1 ఉద్యోగం, రెండో కుమారుడు కిడారి శ్రావణ్‌కు మంత్రి పదవిని ప్రభుత్వం ఇచ్చింది.[4][5]

మూలాలు మార్చు

  1. The Economic Times (28 April 2016). "Two more YSRC MLAs join TDP taking to 16 the total who left party". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  2. BBC News తెలుగు (23 September 2018). "'అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును కాల్చి చంపిన మావోయిస్టులు'". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  3. India Today (23 September 2018). "Andhra MLA, ex-MLA shot dead in Maoist attack" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2020. Retrieved 11 July 2021.
  4. The Times of India, Gopi Dara / TNN / Updated: (2018). "Supernumerary post created for slain MLA Kidari's second son | Vijayawada News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  5. Zee News Telugu (10 November 2018). "దివంగత ఎమ్మెల్యే కిడారి కుమారుడు శ్రావణ్‌కు ఏపీ కేబినెట్‌లో స్థానం?". Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.