తెలుగుదేశం పార్టీ

భారతదేశం లోని రాజకీయ పార్టీ


తెలుగుదేశం పార్టీ లేదా తె.దే.పా భారతదేశంలోని ఒక జాతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు.[1] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

తెలుగుదేశం పార్టీ
నాయకత్వంచంద్రబాబు నాయుడు
వ్యవస్థాపననందమూరి తారక రామారావు
పార్లమెంటరీ పార్టీ నేత[[లావు శ్రీకృష్ణ దేవరాయలు ]]
డిప్యూటీ పార్లమెంట్ పార్టీ నేతలు దగ్గుమళ్లీ ప్రసాదరావు, బైరెడ్డి శబరి
రాజ్యసభలో పార్టీ నేతకనకమేడల రవీంద్ర కుమార్
స్థాపనమార్చి 29, 1982
ప్రధాన కార్యాలయంరోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, హైదరాబాదు-500033, తెలంగాణా, మంగళగిరి (అమరావతి), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
రంగుపసుపు
రాజ్య సభ
1 / 245
లోక్ సభ
3 / 545
ఆంధ్రప్రదేశ్ శాసన సభ
19 / 175
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి
8 / 58
తెలంగాణ శాసన సభ
0 / 119
తెలంగాణ శాసన మండలి
0 / 40
ఓటు గుర్తు
తె.దే.పా party symbol
వెబ్ సిటు
https://www.telugudesam.org/
జెండా

నందమూరి తారక రామారావు శకం

మార్చు
 

నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.

వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది.నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు.ఇది చూసిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు.

1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.

1989, 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు.

1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి రెవెన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది.

తెలుగుదేశం పార్టీ విధానాలు, ఆశయాలు

మార్చు
  • రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి.
  • గంగ నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం.
  • రాష్ట్రాలకు మరిన్ని స్వయంప్రతిపత్తి అధికారాలు కల్పించాలి
  • కూడు, గూడు, గుడ్డ. (ఆహారం, ఇల్లు, బట్టలు.) ప్రతి స్వాతంత్ర పౌరుడికి ఇవ్వాలి
  • నిర్బంధ ఉచిత విద్య.
  • అందరికి ఆరోగ్యం. ఉచిత వైద్యం. హెల్త్ కార్డ్.
  • ఆడవాళ్ళకు సమాన ఆస్థి హక్కు.
  • క్రమశిక్షణ? నియంతృత్వమా?

చంద్రబాబు నాయుడి శకం

మార్చు
 
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు

1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కింది. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" చరిత్ర సృష్టించారు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులు గెలవకపోయినా ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్థాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటారు. చంద్రబాబు నాయుడు హైదరాబాదును, రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలనుకున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.

2024 పార్లమెంట్ ఎన్నికలలో నరసారావు పేట నుంచి గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలను లోక్ సభ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్‌రావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్లమెంటరీ విప్‌గా గంటి హరీష్‌ గా ఎంపిక చేశారు[2].

ఎన్నికల చరిత్ర

మార్చు

శాసనసభ ఎన్నికలు

మార్చు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతం ఫలితం
1983 7వ శాసనసభ
201 / 294
54.03% గెలుపు
1985 8వ శాసనసభ
202 / 294
46.21% గెలుపు
1989 9వ శాసనసభ
74 / 294
36.54% ఓటమి
1994 10వ శాసనసభ
216 / 294
44.14% గెలుపు
1999 11వ శాసనసభ
180 / 294
61.22% గెలుపు
2004 12వ శాసనసభ
47 / 294
37.59% ఓటమి
2009 13వ శాసనసభ
92 / 294
28.12% ఓటమి

ఆంధ్రప్రదేశ్

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతం ఫలితం
2014 14వ శాసనసభ
102 / 175
44.9% గెలుపు
2019 15వ శాసనసభ
23 / 175
39.17% ఓటమి
2024 16వ శాసనసభ
135 / 175
45.6% గెలుపు

తెలంగాణ

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు ఓట్ల శాతం ఫలితం
2014 1వ శాసనసభ
15 / 119
14.7% ఓటమి
2018 2వ శాసనసభ
2 / 119
3.51% ఓటమి

లోక్‌సభ ఎన్నికలు

మార్చు
సంవత్సరం సాధారణ ఎన్నికలు గెలిచిన స్థానాలు
1984 8వ లోక్‌సభ
30 / 42
1989 9వ లోక్‌సభ
2 / 42
1991 10వ లోక్‌సభ
13 / 42
1996 11వ లోక్‌సభ
16 / 42
1998 12వ లోక్‌సభ
12 / 42
1999 13వ లోక్‌సభ
29 / 42
2004 14వ లోక్‌సభ
5 / 42
2009 15వ లోక్‌సభ
6 / 42
2014 16వ లోక్‌సభ
16 / 42
2019 17వ లోక్‌సభ
3 / 25
2024 18వ లోక్‌సభ
16 / 25

తెలుగు దేశం పార్టీ విభాగాలు

మార్చు

తెలుగు యువత అనగా తెలుగుదేశం పార్టీ యొక్క యువజన విభాగం. ఈ విభాగం తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తుంది. పార్టీ తరపున జరిగే కార్యక్రమాలలో భాగస్వామ్యమయి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. పార్టీకి నామినేటేడ్ పదవులు ఉన్నట్లుగానే తెలుగు యువతకు అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోశాధికారి, సభ్యులు అనే నామినేటేడ్ పదవులు ఉంటాయి.

తెలుగు మహిళ

తెలుగు మహిళ అనగా తెలుగుదేశం పార్టీ యొక్క మహిళా విభాగం.

తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ( TNSF ) అనేది తెలుగుదేశం పార్టీ యొక్క విద్యార్థి విభాగం. జాతీయ పార్టీ కన్వీనర్ నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు .

వీడియోలు

మార్చు

యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్లో [3] తెలుగుదేశం నాయకుల ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.

ప్రచారం, సిద్ధాంతాలు

మార్చు
1952లో ఎన్టీఆర్ నటించిన పల్లెటూరు సినిమాలోని చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాటను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విస్తృతంగా వినియోగించింది.
  • తెలుగు భాష సిద్ధాంతం, తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాష ప్రచారం, తెలుగు ప్రజలు. తెలుగు భాషా ఆత్మగౌరవ దినోత్సవ వేడుకలు, తెలుగువాదం, పసుపువాదం.
  • ప్రతి పేదవానికి కూడు, గూడు, గుడ్డ. (ఆహారం, ఇల్లు, బట్టలు.)
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించడం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, వెలిగొండ నిర్మించడం.
  • రైతుల సంక్షేమం.
  • పర్యావరణ పరిరక్షణ, రక్షణ ముఖ్యంగా తూర్పు కనుమలు, నదులు, సరస్సులు స్థిరమైన అభివృద్ధి.
  • తెలుగు సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ.
  • దేశం మొత్తం నదుల అనుసంధానం. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నదులు అనుసంధానం.
  • జాతీయ రహదారులు, విమానాశ్రయాలకు అనుసంధానం.
  • ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం 974 కిలోమీటర్ల పొడవైన బీచ్ రోడ్ అభివృద్ధి.
  • ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్.
  • నందమూరి తారకరామారావుకు 'భారతరత్న' ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
  • తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగుదేశంపార్టీ!

మూలాలు, వనరులు

మార్చు
  1. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [1] Archived 2016-04-28 at the Wayback Machine వివరాలు జులై 19, 2008న సేకరించబడినది.
  2. Service, Express News (2024-06-28). "TDP's Krishna Devarayalu to lead party in Lok Sabha, Andhra CM Naidu confirms". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-08-15.
  3. యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్

ఇవికూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు