కిన్నరులు దేవతలలో ఒక తెగవారు. వీరి శరీరము మనుషుల వలె, ముఖము అశ్వము వలె ఉండును. వీరు పులస్త్యుని పుత్రులు. వీరు ఒక విధమైన దేవ కన్యలు.

హిందూ, బౌద్ధ పురాణాల ప్రకారం కిన్నర సగం మానవుడు, సగం గుర్రం లేదా సగం మనిషి సగం పక్షిగా చిత్రీకరించారు. ఆగ్నేయాసియా పురాణాలలో కిన్నరను సగం పురుషుడు సగం గుర్రం, దాని ప్రతిరూపం కిన్నారి సగం స్త్రీ సగం పక్షిగా వర్ణిస్తుంది. వారిద్దరినీ ఆదర్శ ప్రేమికులుగా భావిస్తారు[1].

ఆగ్నేయాసియా పురాణాలలో, కిన్నరలు మహిళా ప్రతిరూపమైన కిన్నారి సగం పక్షి, సగం స్త్రీ జీవులుగా చిత్రీకరించబడింది. పౌరాణిక హిమావంతంలో నివసించే అనేక జీవులలో కిన్నరి ఒకటి, కిన్నారి మహిళ తల, మొండెం, చేతులు కలిగి ఉండి ఒక హంస రెక్కలు, తోక, పాదాలను కలిగి ఉంటుంది. వారు వారి నృత్యం, పాట, కవితలకు ప్రసిద్ధి చెందారు. స్త్రీ సౌందర్యం, దయ, సాఫల్యానికి సాంప్రదాయ చిహ్నం.

మూలాలుసవరించు

  1. "Kinnara". Ancient Symbols (in ఆంగ్లం). Archived from the original on 2019-08-13. Retrieved 2020-04-13.


"https://te.wikipedia.org/w/index.php?title=కిన్నరులు&oldid=3048606" నుండి వెలికితీశారు