పులస్త్యుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులులో ఒకరు.[1], ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరములోని (ఏడవ మన్వంతరము) సప్తర్షులలో ఒకడు.[2].

కొన్ని పురాణాలు పులస్త్యుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది, పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు.

పులస్యుడు కర్ధముని తొమ్మిది మంది కుమార్తెలలో ఒకతయిన హవిర్భును వివాహమాడినాడు. హవిర్భు ద్వారా పులస్యునికి అగస్త్యుడు జన్మించాడు. పులస్యునికి ఇద్దరు భార్యలు. పులస్త్యుని రెండవ భార్య, రాజర్షి పుత్రిక అయిన తృణబిందు నకు కుమారుడు విశ్రవసుడు కలిగాడు. సుమాలి కూతురైన కైకసి వలన విశ్రవసునికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ జన్మించారు. మరో భార్య ఇద్విద ద్వారా కుబేరుడు జన్మించాడు. ఈ విధంగా పులస్త్యుడు కుబేరుడు, రావణుడు వంటి వారితో సహా సమస్త రాక్షసులకు మూలపురుషుడు.

పులస్యుడు దక్షుని కూతురైన ప్రిథిని వివాహమాడినాడు. ఈమెనే భాగవతములో హవిస్భూగా చెప్పబడింది.[3]

ఇద్విద, తృణబిందుడు, అలంబూష అనే అప్సరసల కూతురు. తృణబిందుడు వైవస్వత మనువు వంశములోని మరుత్తుని సంతతికి చెందినవాడు. తృణబిందుడు యాగము చేసి బిందెల నిండా బంగారాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు. అంత తీసుకొని వెళ్ళలేని బ్రాహ్మణులు చాలా బిందెలను అక్కడే వదిలి వెళ్ళారు. యుధిష్ఠిరుడు యాగము చేసినప్పుడు ఈ బంగారాన్నే తీసుకొని యాగంలో ఉపయోగించాడు. తృణబిందుడు చక్రవర్తి, అందగాడు.

మూలాలు మార్చు

  1. Narada said.. The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. p. 25 And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, these Prajapatis, and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."
  2. Inhabitants of the Worlds Mahanirvana Tantra, translated by Arthur Avalon, (Sir John Woodroffe), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other sapta-rshi. In the present manvantara the seven are Kashyapa, Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.
  3. Hindu Mythology, Vedic and Purānic: Vedic and Purānic By William Joseph Wilkins పేజీ.305 [1]
  • Buck, William. Ramayana. Berkeley: University of California Press, 1976.
  • Dowson, John (1820-1881). A classical dictionary of Hindu mythology and religion, geography, history, and literature. London: Trübner, 1879 [Reprint, London: Routledge, 1979]. This book is in the public domain (and no copyright notice appears in the latest edition).