కిరణ్ సింగ్ దేవ్

(కిరణ్ సింగ్ డియో నుండి దారిమార్పు చెందింది)

కిరణ్‌సింగ్ దేవ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జగదల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబర్ 22న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1]

కిరణ్ సింగ్ దేవ్

మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 డిసెంబరు 13

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2023 డిసెంబరు
నియోజకవర్గం జగదల్‌పూర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

రాజకీయ జీవితం

మార్చు

కిరణ్‌సింగ్ దేవ్ భారతీయ జనతా పార్టీలో (బిజెపి) 1985 నుండి 1986 వరకు బస్తర్ జిల్లా విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1998 నుంచి 2002 వరకు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, 2022లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. కిరణ్‌సింగ్ దేవ్ 2009 నుండి 2014 వరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, 2009లో జగదల్‌పూర్ మేయర్‌గా పని చేశాడు.

కిరణ్ సింగ్ దేవ్ 2014లో రాష్ట్ర బీజేపీ కార్యదర్శిగా, 2020 నుండి 2022 వరకు విష్ణు దేవ్ సాయి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన 2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో జగదల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి[2], 2023 డిసెంబర్ 22న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. The Times of India (22 December 2023). "First-time MLA named Chhattisgarh BJP chief". Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  2. India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  3. The Indian Express (21 December 2023). "In Chhattisgarh, first-time MLA at the helm of BJP: Who is Kiran Singh Deo?" (in ఇంగ్లీష్). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
  4. The Hindu (21 December 2023). "First-time MLA Kiran Singh Deo is the new Chhattisgarh BJP chief" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.