కిల్లి కృపారాణి

డాక్టర్ కిల్లి కృపారాణి ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార, టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.

కిల్లి కృపారాణి
కిల్లి కృపారాణి


భారత పార్లమెంటు సభ్యులు
పదవీ కాలం
2009- 2014
ముందు కింజరాపు ఎర్రంనాయుడు
తరువాత కింజరాపు రామ్మోహన నాయుడు
నియోజకవర్గం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1979-11-19) 1979 నవంబరు 19 (వయసు 45)
శ్రీకాకుళం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి డాక్టర్ కిల్లి రామ్మోహనరావు
సంతానం ఇద్దరు
నివాసం టెక్కలి గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మతం కాళింగ, హిందూ
వెబ్‌సైటు kruparani.killi@sansad.nic.in

బాల్యము , విద్యాభ్యాసము

మార్చు

శ్రీకాకుళంలో 1965 నవంబరు 19 న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించింది. విశాఖపట్నం ఆంధ్ర వైద్య కళాశాల నుండి ఎం. బి. బి. ఎస్ పూర్తిచేసింది.

రాజకీయ ప్రస్థానం

మార్చు

2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయింది. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీగా గెలిచిన కింజరాపు ఎర్రన్నాయుడు పై భారీ మెజారిటీతో గెలిచి[1] ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్​లోనే కొనసాగిన ఆమె 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరి, 2019, 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించగా, ఆమెకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆమె 2024 ఏప్రిల్ 3న వైసీపీకి రాజీనామా చేసి[2], ఏప్రిల్ 5న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి[3] 2024లో అసెంబ్లీ ఎన్నికలలో టెక్కలి నుండి పోటీ చేయనుంది.

వ్యక్తిగత జీవితము

మార్చు

ఈవిడ వివాహము డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావుతో 1985 జూన్ 12 న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు.

సందర్శించిన దేశాలు

మార్చు

ఈమె బ్రిటన్, అమెరికా, వంటి దేశాలలో పర్యటించింది. ఆయా దేశాలలో భారత ప్రభుత్వం తరుపున అనేక సమావేశాలలో పాల్గొన్నది.

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-29. Retrieved 2013-03-19.
  2. Eenadu (3 April 2024). "వైకాపాకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.
  3. Andhrajyothy (5 April 2024). "కాంగ్రెస్‌లో చేరిన కృపారాణి". Archived from the original on 5 April 2024. Retrieved 5 April 2024.