కిషోరీ అమోంకర్

పద్మభూషణ్ పురస్కారగ్రహీత

కిషోరీ అమోంకర్ (మరాఠీ: किशोरी आमोणकर; 1932 ఏప్రిల్ 10 - 2017 ఏప్రిల్ 3) ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.

కిషోరీ అమోంకర్
కిషోరీ అమోంకర్
వ్యక్తిగత సమాచారం
జననం1932 ఏప్రిల్ 10 [1]
మరణం2017 ఏప్రిల్ 3(2017-04-03) (వయసు 84)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
సంగీత శైలిహిందుస్థానీ శాస్త్రీయ సంగీతము
వాయిద్యాలుగాత్రము
జీవిత భాగస్వామిరవి అమోంకర్‌
పిల్లలు2

జీవిత చరిత్ర మార్చు

కిషోరీ అమోంకర్ తల్లి, సుప్రసిద్ధ హిందుస్తానీ సంగీత గాయకురాలు, మేఘాబాయి కుర్దీకర్. కిషోరీ తల్లి వద్దనే సంగీతాన్ని అభ్యసించింది.

సంగీత ప్రస్థానం మార్చు

కిషోరీ అమోంకర్ జయ్‌పూర్-అత్రౌలి ఘరానా యొక్క క్లిష్టమైన సంగతులను త్వరలోనే ఆకళింపు చేసుకొని, తన స్వంత గాయన శైలిని రూపొందించుకొంది. ఈమె తన సహజమైన మధుర గాత్రంతో, పురాతన జయ్‌పూర్-అత్రౌలి ఘరానా సాంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, అలవోకగా రాగాలను ఆలపించి, అటు సంగీత విద్వాంసులను, ఇటు శ్రోతలను ఆకట్టుకొంటుంది. ఆమె గాయనంలో బోల్తాన్, ఫిర్తాన్ ల సౌందర్యం చెక్కుచెదరదు. ఆమె హిందీమరియు మరాఠీ భక్తిగీతాలు, సంస్కృత, కన్నడ భజనల నెన్నింటినో పాడింది.

శిష్యగణం మార్చు

మానిక్ భిడె, పద్మా తల్వార్కర్, అరుణ్ ద్రావిడ్, రఘునందన్ పన్శీకర్, వయొలినిస్ట్, మిలింద్ రాయ్కర్, విద్యా భగ్‌వత్, మనవరాలు తేజశ్రీ అమోంకర్‌లు.

వ్యక్తిగత జీవితం మార్చు

కిషోరీ అమోంకర్ బడిపంతులు, రవి అమోంకర్‌ను పెళ్ళి చేసుకున్నది. ఈ దంపతులకు బిభాస్, నిహార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 1992లో, రవి అమోంకర్‌ మరణించాడు. కిషోరీ అమోంకర్ రాఘవేంద్ర స్వామి భక్తురాలు.

విడుదలైన ఆల్బంలు మార్చు

1. దివ్య (2008) 2. ప్రభాత్ (2000) 3. సాంప్రదాయ (2003) 4.మల్హార్ మాలిక 5. సంగీత్ సర్తాజ్ 6. కిషోరీ అమోంకర్ - లైవ్ ఇన్ లండన్ 7. దృష్టి 8. బాగెశ్రీ ‍‍‍‍‍‍‍, భూప్ - ఎల్.పి. రికార్డు (1972)

అవార్డులు మార్చు

మరణం మార్చు

కిషోరీ అమోంకర్ ముంబైలోని తన నివాసంలో 2017 ఏప్రిల్ 3న తన 84వ ఏట నిద్రలోనే మరణించింది.[2]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. "Semiosis in Hindustani music". Encyclopædia Britannica Online.
  2. "Classical music maestro Kishori Amonkar dies at 84". The GenX Times (in అమెరికన్ ఇంగ్లీష్). 4 April 2017. Archived from the original on 16 June 2018. Retrieved 4 April 2017.