హిందుస్తానీ భాష
హిందుస్తానీ : ( Hindustani Language) భారత దేశంలో మెజారిటీ ప్రజల భాష హిందుస్తానీ . అది లిపుల్ని బట్టి హిందీ ఉర్దూ భాషలుగా చీలింది. హిందీ , సంస్కృతము, పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు కలిసి ఉర్దూ భాష ఇండియా లోనే పుట్టింది. హిందీ ఉర్దూ ప్రజలిద్దరికీ వాడుక భాష మటుకు ఒకటే హిందుస్తానీ[1].
హిందీ సినిమాలలో ఈ హిందుస్తానీ భాషే రాజ్యమేలుతోంది. హిందీ, ఉర్దూ ఒకటే భాష. కొందరు పండితులు వారి వారి మతాల ప్రత్యేకగుర్తింపు కోసం హిందుస్తానీకి సంస్కృతపదాలు ఎక్కువ కలిపితే హిందీ గానూ, ఫారశీ పదాలు ఎక్కువగా కలిపితే ఉర్దూ గానూ మారుతుంది. ఈ రెండు భాషలకూ సొంత లిపులు లేవు. అరువుతెచ్చుకున్న దేవనాగరి పర్షియన్ లిపుల్లో వ్రాస్తారు. ఈ రెంటినీ ఇంగ్లీషు లిపిలో రాస్తే ఒకే భాషగా తేల్తాయి. ఉర్దూ అంటేనే సంతలో జనం మాట్లాడే సామాన్య భాష. పార్లమెంటులో అధికారభాషను ప్రకటించే విషయంలో జరిగిన ఓటింగ్ లో హిందీ ఉర్దూ భాషలకు సమానంగా ఓట్లొచ్చాయి, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారు వేసిన ఒక్క అనుకూల ఓటుతో హిందీ భాష ఆమోదం పొందింది. వాస్తవానికి సాధారణ ప్రజలు మాట్లాడేది హిందుస్తానీ భాషే. ఫార్శీ లిపిలో రాస్తే ఉర్దూ, దేవనాగరి లిపిలో రాస్తే హిందీ అవుతాయి.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The Oxford English Dictionary
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- Shakespear, John. A Dictionary, Hindustani and English. 3rd ed., much enl. London: Printed for the author by J.L. Cox and Son: Sold by Parbury, Allen, & Co., 1834.
- Encyclopedia Britannica, 11th Edition: Hindostani Archived 2016-03-03 at the Wayback Machine
- Hindi, Urdu, Hindustani, khaRî bolî
- Hindi-Urdu FAQ
- Hindustani as an anxiety between Hindi-Urdu Commitment