కిసాన్ క్రెడిట్ కార్డు

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రైతులకు వారి స్వల్పకాలిక ఉత్పత్తులను సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు తదితర అవసరాలకు కావాల్సిన సరైనమొత్తాలు, సరైనసమయాల్లో అందించడమే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ముఖ్యోద్దేశ్యం. దీనివల్ల రైతులకు ఖర్చుకు తగ్గట్టుగా రుణాలను చెల్లించే వెసులుబాటు కలుగుతుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పథకం వల్ల లాభాలేమిటి?సవరించు

 • సరళీకృతమైన రుణాల పంపిణీ విధానం.
 • డబ్బూ గురించి రైతులు ఇబ్బంది పడనవసరం లేదు
 • ప్రతి పంటకీ రుణం కోసం అప్లై చేసుకోనక్కర్లేదు.
 • ఖచ్ఛితంగా రుణం దొరుకుతుంది కాబట్టి రైతుకు వడ్డి భారం తగ్గుతుంది.
 • విత్తనాలను, ఎరువులను తమకిష్టం వచ్చినపుడు, తాము ఎంచుకొన్నవాటిని కొనుక్కొనె వెసులుబాటు ఉంటుంది.
 • డబ్బిచ్చి కొనుక్కోవడంవల్ల వచ్చే డిస్కౌంట్‌లను డీలర్లనుంచి పొందవచ్చు.
 • 3ఏళ్లపాటు రుణ సౌకర్యం - ప్రతి సీజనుకీ ఎవరికీ చెప్పనక్కర్లేదు.
 • వ్యవసాయ ఆదాయాన్నిబట్టే గరిష్ఠ రుణ పరిమితి
 • గరిష్ఠ రుణ పరిమితికి లోబడి ఎన్ని సార్లైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
 • పంటకోత అయ్యాకే రుణాన్ని తిరిగి చెల్లించే అవసరం.
 • వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే వడ్డీ రేటే దీనికీ వర్తిస్తుంది.
 • వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే సెక్యూరిటీ, డాక్యుమెంటేషన్‌ షరతులే దీనికీ వర్తిస్తాయి.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడం ఎలా?సవరించు

 • సమీప పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు నుండి.
 • అర్హతగల ప్రతి రైతుకూ ఒక కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పాస్‌బుక్‌ ఇవ్వడం జరుగుతుంది. అందులో రైతు పేరూ, చిరునామా, భూమి వివరాలూ, రుణ గరిష్ఠ పరిమితి, కాలవ్యవధి, ఫోటో - అన్ని ఉండి ఒక ఐడెంటిటీ కార్డ్‌గానూ, లావాదేవీలకు రికార్డుగానూ పనికొస్తుంది.
 • రుణాన్ని పొందినవారు ఆ కార్డ్‌ను, పాస్‌బుక్‌ను రుణాన్ని పొందే సమయంలో చూపాలి.

వివిధ లీడింగ్‌ బ్యాంకులిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ల పేర్లుసవరించు