కుంజా బొజ్జి
కుంజా బొజ్జి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన అనారోగ్యంతో కొంతకాలంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 12న మరణించాడు.[1]
కుంజా బొజ్జి | |||
| |||
నియోజకవర్గం | భద్రాచలం నియోజకవర్గం | ||
---|---|---|---|
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1985 – 1999 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1926 అడివి వెంకన్నగూడెం గ్రామం, వరరామచంద్రపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. | ||
మరణం | 2021 ఏప్రిల్ 12 భద్రాచలం | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
నివాసం | భద్రాచలం, ఖమ్మం జిల్లా. |
జననం
మార్చుకుంజా బొజ్జి 1926లో అడివి వెంకన్నగూడెం గ్రామం, వరరామచంద్రపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు.[2] ఆయన భార్య లాలమ్మ 2018లో చనిపోయింది. బొజ్జికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ నేపథ్యం
మార్చుకుంజా బొజ్జి 1950లో సాయుధ తెలంగాణా పోరాటంలో గెరిల్లా దళాల కొరియర్ గా పనిచేశాడు.1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాడు. 1970లో తొలిసారిగా సర్పంచ్ ఎన్నికల్లో వరరామచంద్రపురం మండలం రామవరం సర్పంచిగా పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యాడు. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[3] ఆయన 1989, 94లలో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy. "'ఏజెన్సీ సుందరయ్య' కుంజా బొజ్జి కన్నుమూత". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ TV9 Telugu (12 April 2021). "Kunja Bojji: పెన్షన్ డబ్బులూ ప్రజల కోసమే..తుది శ్వాస వరకూ ప్రజాసేవలోనే..'కుంజా బొజ్జి' ఓ అరుదైన నాయకుడు! - Kunja Bojji Kunja Bojji a rare political leader with ethics down to earth characteristics special story". TV9 Telugu. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (29 October 2023). "ఇంకా జనం గుండెల్లోనే." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ సాక్షి (12 April 2021). "భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మృతి". Sakshi. Archived from the original on 12 ఏప్రిల్ 2021. Retrieved 12 April 2021.
- ↑ Tv5 News (12 April 2021). "మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా లేని రాజకీయ నేత.. కుంజా బొజ్జి కన్నుమూత". www.tv5news.in (in ఇంగ్లీష్). Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)