కుందూరు జానారెడ్డి

కుందూరు జానారెడ్డి, (1946 జూన్ 20) 2004-09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహశాఖా మంత్రిగా పనిచేసాడు.[1]

కుందూరు జానారెడ్డి
కుందూరు జానారెడ్డి

కుందూరు జానారెడ్డి


మాజీ గృహమంత్రి, ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
మే 2004 – ఏప్రిల్ 2009
నియోజకవర్గం నాగార్జున సాగర్ (నల్గొండ జిల్లా)

వ్యక్తిగత వివరాలు

జననం 20 Jun 1946 (1946-06-20) 1946 జూన్ 20 (వయసు 78)
అనుమోలు, నల్గొండ, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
జీవిత భాగస్వామి సుమతి
సంతానం రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి
నివాసం హైదరాబాద్
మతం హిందూ

జానారెడ్డి నాగార్జున సాగరు సమీపంలోని నల్గొండ జిల్లా, అనుముల గ్రామంలో జన్మించాడు. జానారెడ్డి ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1983లో చలకుర్తి నియోజకవర్గం నుండి తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అదే నియోజకవర్గం నుండి ఆరు పర్యాయాలు శాసనసభకు ఎన్నికై వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెటింగ్, అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, కొలతలు, తూనికలు, రవాణా, రోడ్లు, భవనాలు, గృహ, పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి సదుపాయం, శుభ్రత మొదలైన వివిధ మంత్రిత్వ శాఖలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత దీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మానందరెడ్డి నెలకొల్పిన రికార్డును అధిగమించి నిలిచాడు.

రాజకీయ జీవితం

మార్చు

జానా రెడ్డి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ సమీపంలోని అనుముల గ్రామంలో జన్మించారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా జానా రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది 1983లో నల్గొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుంచి జానారెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. జానారెడ్డి చలకుర్తి నియోజకవర్గం నుండి ఏడు సార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, అటవీ, పశుసంవర్ధక, మత్స్య, తూనికలు & కొలతలు, , రవాణా, రోడ్లు & భవనాలు హౌసింగ్ పంచాయితీ రాజ్, గ్రామీణ నీటి పథకం పారిశుధ్య లాంటి ప్రభుత్వ శాఖలకు జానారెడ్డిమంత్రిగా పనిచేశారు. ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డ్ ను జానారెడ్డి బద్దలు కొట్టారు.

1988లో 30 మంది క్యాబినెట్ మంత్రులను మార్చడంపై జానారెడ్డి ఎన్‌టి రామారావుతో విభేదించి జానా రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు., అప్పటి భారతదేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి జానారెడ్డి కృషి చేశాడు. జానా రెడ్డి 2004లో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో జానారెడ్డి హోం శాఖ మంత్రిగా పనిచేశారు.

అంతకు ముందువారు
టి.దేవేందర్ గౌడ్
ఆంధ్రప్రదేశ్ గృహమంత్రి
2004 - 2009
తరువాత వారు
సబిత ఇంద్రారెడ్డి

మూలాలు

మార్చు
  1. "ఆంధ్ర ప్రదేశ్ ఆన్ లైన్ వెబ్ సైట్". Archived from the original on 2013-10-08. Retrieved 2009-02-23.

బయటి లంకెలు

మార్చు