కుందేళ్ళ మేత యాజమాన్య పద్ధతులు

కుందేళ్ళు అన్ని రకాల తృణధాన్యాలను ఇష్టపడతాయి, చిక్కుళ్ళు, పచ్చిరొట్ట రకాలైన డెస్మంతస్, పశువులకు వేసే పచ్చిగడ్డి, అగాతి, వంటింటి వ్యర్థపదార్థలైన కారెట్, క్యాబేజీ ఆకులు, ఇతర కాయగూరల వ్యర్థాలను కూడా కుందేళ్ళు ఇష్టపడతాయి.[1]

కుందేళ్ళ మేతలో ఉండవలసిన పోషకాలు

పోషకాల వివరాలు పెరుగుదల కొరకు పోషణ కొరకు గర్భాధారణ కొరకు స్తన్యము కొరకు
జీర్ణమయ్యే శక్తి (కిలో కేలరీలు) 2500 2300 2500 2500
మాంసకృత్తులు (%) 18 16 17 19
పీచు పదార్థాలు (%) 10-13 13-14 10-13 1013
కొవ్వు (%) 2 2 2 2

కుందేళ్ళ మేతలో యాజమాన్యం గుర్తుంచుకోవలసిన విషయాలు

  • కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం.
  • కుందేళ్ళకు మేత కచ్చితంగా సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి.
  • ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.
  • పౌష్టికాహారాన్ని చిన్న గుళికల రూపంలో ఇవ్వాలి. ఇలా చిన్న గుళికల రూపంలో ఇవ్వడం వీలుకాక పోయినట్లయితే పౌష్టికాహారానికి నీటిని కలిపి చిన్న ఉండల రూపంలో కుందేళ్ళకు ఇవ్వాలి.
  • ఒక కిలో బరువున్న కుందేలుకుః రోజుకు 40 గ్రాముల పౌష్టికాహారం, 40 గ్రాముల పచ్చిరొట్ట ఇవ్వాలి.
  • కుందేళ్ళకు ఎల్లప్పుడూ తాజాగా ఉండే పచ్చిరొట్టను మేతగా ఇవ్వాలి. పచ్చిరొట్టను బోనులో నేల మీద వేయకూడదు కాని వాటిని బోనులో ప్రక్క భాగాలలోపలకు ఉంచవచ్చు.
  • కుందేళ్ళకు రోజంతాపం శుభ్రమైన, నీటిని ఇవ్వాలి.
కుందేలు రకం దాదాపు శరీరం బరువు మేతపరిమాణం రోజుకి (గ్రాములలో) పౌష్టికాహారం మేత మేతపరిమాణం రోజుకి (గ్రాములలో) పచ్చి రొట్ట
మగ కుందేలు 4 - 5 కిలో గ్రాములు 100 250
ఆడ కుందేలు 4 - 5 కిలో గ్రాములు 100 300
పాలిచ్చే, గర్భస్థ కుందేలు 4- 5 కిలో గ్రాములు 150 150
కుందేలు పిల్లలు 0.6-0.7 కిలో గ్రాములు 50-75 150

పౌష్టకాహారం మిశ్రమము యొక్క పాళ్ళు

చేర్చబడిన పదార్థములు మొత్తం
మొక్కజొన్న రవ్వ (నూక) 30 భాగాలు
సజ్జల రవ్వ 30 భాగాలు
వేరుశనగ చెక్కపిండి 13 భాగాలు
గోధుమ పొట్టు 25 భాగాలు
ఖనిజ మిశ్రమం (లవణమిశ్రమం ) 1.5 భాగాలు
ఉప్పు 0.5 భాగం

వనరులు

మార్చు
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]