కుంబలంగి - కేరళలో ఎర్నాకులం జిల్లాలోని ఒక చిన్న లంక గ్రామం. 2019లో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన కుంబలంగి నైట్స్‌ సినిమా ద్వారా ఈ గ్రామం ప్రాచుర్యంలోకి వచ్చింది. జనవరి 2022లో దేశంలోనే శానిటరీ నాప్కిన్‌ (బహిష్టు ప్యాడ్) రహితంగా తొలి గ్రామంగా కుంబలంగి ఘనత సాధించింది.[1] ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సాయంతో ఇక్కడ అవల్కాయి అనే కార్యక్రమం నిర్వహించి మహిళలు రుతుస్రావం సమయంలో నాప్కిన్ల స్థానంలో మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వాడేలా అవగాహన కల్పించింది. శానిటరీ నాప్కిన్‌తో పోలిస్తే ఈ కప్స్‌ తక్కువ ధరకు లభించటం, పర్యావరణహితంగా ఉండటం వంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఏళ్లు పైబడిన మహిళలకు మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ ఉచితంగా పంపిణీ చేశారు.

కుంబలంగి
చైనీస్ ఫిషింగ్ వలలు
కుంబలంగి

మూలాలు

మార్చు
  1. "Kumbalangi శానిటరీ నాప్కిన్‌ రహితంగా కుంబలంగి..దేశంలోనే తొలి గ్రామంగా ఘనత". EENADU. Retrieved 2022-01-15.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కుంబలంగి&oldid=3688274" నుండి వెలికితీశారు