ఋతుచక్రం
ఋతుచక్రం (Menstrual cycle) స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఋతుచక్రాన్ని బహిష్టు, నెలసరి అని కూడా అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ (ముట్లుడిగిపోవటం) అంటారు.

ఋతుచక్ర నియమాలు నాడు - నేడు సవరించు
ఋతు చక్ర సమయంలో చెడురక్త విసర్జన వల్ల శరీరంనుండి దుర్గందం వస్తుంది, ఫలితంగా ఆడపిల్లలు బలహీనంగా, ప్రవర్తనలో చికాకుగా ఉంటారు. అందువల్ల పూర్వం ఇలా నెలసరిలో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ఇంటి అరుగుపై చాప వేసి దానిపై కూర్చోబెట్టేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. బహిష్టు సమయంలో ఆహారంగా అన్నంలో పప్పు - నెయ్యి మాత్రమే తినేవారు. బహిష్టు స్నానం పూర్తి కాగానే గర్భ దోషాలు నివారించబడటానికి గోళీకాయంత పసుపు ముద్ద మ్రింగేవారు. గర్భ దోషాలు ఉండేవి కావు. కాని నేడు స్త్రీ సాధికారత వల్ల, పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల అమ్మాయిలు బహిష్టు నియమాలను ఉల్లఘించడం జరుగుతోంది. ఫలితంగా బహిష్టు నొప్పులు, గర్భస్రావాలు జరుగుతున్నాయి.
నెలసరి నేప్కిన్లు సవరించు
గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో నెలసరి సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం రుతుక్రమం వేళల్లో వాడేందుకు శుభ్రమైన రుతుక్రమ రుమాళ్లను (ముట్టు బట్టలు, ప్యాడ్లు/నేప్కిన్లు) ప్రభుత్వం అందించనుంది. పేదరిక రేఖకు దిగువన (బీపీఎల్) ఉండే 10-19 సంవత్సరాల మధ్య వయసున్న కోటిన్నర మంది బాలికలకు చౌక ధరకు వీటిని పంపిణీ చేస్తారు. ఆరు రుమాళ్లతో కూడిన ఒక పొట్లం ధర రూ.1 గా నిర్ణయించారు. బీపీఎల్ ఎగువ కుటుంబాల బాలికలకు మాత్రం రూ.5కు ఒకటి చొప్పున అందజేస్తారు.వీటిని పంపిణీ చేసే బాధ్యతను ఆశా కార్యకర్తలకు అప్పగిస్తారు.