కుడితి అనగా బియ్యములోనగువాని కడుగు నీరు అని అర్థము. అదేవిధముగా సామాన్యముగా వంటింటిలో (పల్లెల్లో) వృధా ద్రవ పదార్థాలన్నీ... మిగిలిన వంటలు, కూరలు మొదలగు వన్నీ ఒక తొట్టెలో వేసి పశువులకు పెడతారు దానినే కుడితి అని అంటారు

కుడుతొట్టిలో పశువులు త్రాగే ద్రవ పదార్థాలను కుడితి అంటారు. కుడుతొట్టి అనగా మట్టితో చేసిన ఒక పెద్ద పాత్ర. ఇందులో వంటింటిలో వెలువడే గంజి, బియ్యం కడుగు నీళ్ళు, చద్దినీళ్ళు మొదలగు ద్రవ పదార్థాలతో పాటు గానుగ పిండి, తౌడు, మిగిలి పోయిన అన్నము, కూరలు మొదలగు వాటిని వేస్తారు, పశువులు వాటిని చాలా ఇష్టంగా త్రాగుతాయి దానినే కుడితి అంటారు.

కుడుచు = అనగా త్రాగు, లేదా తిను అని అర్థం. దాని నుండి పుట్టిన మాటే కుడితి.

కుడితి: సంబంధించిన సామెతలు:

  • కుడితిలో పడ్డ ఎలక లాగ కొట్టు కుంటున్నాడు.
  • అందరికీ శకునం చెప్పే బల్లి చివరకు కుడితిలో పడి చచ్చినట్లు.
"https://te.wikipedia.org/w/index.php?title=కుడితి&oldid=3877616" నుండి వెలికితీశారు