కుమారిముత్తు
కుమారిముత్తు తమిళ సినిమా హాస్యనటుడు, డి.ఎం.కె పార్టీ నాయకుడు. [1][2] తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేక మేనరిజంతో, తనదైన నవ్వుతో పలు సినిమాల్లో హాస్యాన్ని పండించారు. 'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్' 'ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, 'మరుమగన్' సినిమాలు ఆయన కెరియర్లో ప్రధానమైనవిగా నిలిచాయి. మూడు దశాబ్దాల పాటు సినీరంగానికి సేవలందించిన కుమారిముత్తు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ సభ్యుడిగా తమిళనాట రాజకీయాల్లోకి ప్రవేశించారు.[3]
కుమారిముత్తు | |
---|---|
జననం | 1940 |
మరణం | 29 ఫిబ్రవరి 2016 (వయస్సు 77) |
వృత్తి | సినిమా నటుడు |
జీవిత విశేషాలు
మార్చుఆయన రంగస్థలం నుంచి సినిమా రంగానికి పరిచయం అయిన నటుడు. ఈయన సొంత ఊరు కన్యాకుమారి జిల్లా,కాట్టుప్పుదురై గ్రామం. ఆయన నటుడు నంబిరాజన్, దర్శకుడు కేఎం.బాలక్రిష్ణన్‌ల తమ్ముడు. 1964లో నగేశ్ నటించిన పోయ్‌సొల్లాదే చిత్రం ద్వారా చిత్ర రంగప్రవేశం చేసిన కుమరిముత్తు తమిళంతో పాటు తెలుగు, కన్నడం,మలయాళం భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. కలైమామణి అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నా కుమరిముత్తుకు తన నవ్వే ప్రత్యేకం.[4]
నటించిన కొన్ని సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | Notes |
---|---|---|---|
1981 | నందు | ||
1982 | ముల్లిల్లత రోజా | ||
1982 | కోఝి కోవుతు | ||
1984 | మదురై సోరన్ | ||
1984 | వెల్లాయ్ పూరా ఒండ్రు | ||
1984 | కై కొడుక్కం కాయ్ | ||
1986 | ఓమాయ్ విజిగల్ | ||
1986 | అరువదై నాల్ | లోతా | |
1986 | ఒరు ఇనియ ఉదయం | ||
1986 | డిసెంబర్ పూకల్ | ||
1987 | ఆనంద్ | ||
1988 | చిన్న పూవె మల్ల పేసు | ||
1988 | మనసుక్కుల్ మతప్పు | ||
1988 | ఇదు నమ ఆలు | ||
1988 | సహదేవన్ మహదేవన్ | ||
1989 | పోగి వరుం కావేరీ | ||
1990 | పుదు వసంతం | ||
1991 | ఇరుంబు పోకల్ | ||
1991 | చరణ్ పాండ్యన్ | ||
1991 | నంబర్గల్ | ||
1992 | నాన్‌గల్ | ||
1992 | ఇందు | ||
1992 | ఎంగ వీటు వాలన్ | ||
1993 | పెట్రెదుత పిల్లై | ||
1994 | సక్తివెల్ | ||
1995 | చక్రవర్తి (1995 సినిమా) | ||
1995 | ఓరు ఓర్లా ఓరు రాజ్ కుమారి | ||
1995 | రాజీవిన్ పార్వైయిలె | ||
1995 | తోట్ట చినుగి | ||
1995 | ఆనజగన్ | ||
1995 | తేడి వంద రాసా | ||
1995 | మరుమగన్ | అరుముగం | |
1996 | హలో గురూ | తెలుగు | |
2001 | కన్నుక్కు కన్నగా | పెరుమాల్ | |
2002 | అండిపట్టి అరసంపట్టి | అరసంపట్టి తండ్రి | |
2004 | జననం | ||
2009 | విల్లు |
మరణం
మార్చుఆయన ఫిబ్రవరి 29 2016 న తన 77వ యేట కన్నుమూసారు.[5][6]
వ్యక్తిగత జీవితం
మార్చుకుమరిముత్తుకు భార్య పుణ్యవతి, కొడుకు ఐసక్ మాదవరాజన్, కూతుళ్లు సెల్వపుష్ప, ఎలిజబెత్ మేరీ, కవిత ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ B. Kolappan (29 March 2011). "Quest for star power". The Hindu.
- ↑ S.R. Ashok Kumar (6 May 2005). "Telefilm 'Engey Avan,' a laugh riot". The Hindu. Archived from the original on 9 మే 2008. Retrieved 2 మార్చి 2016.
- ↑ ప్రముఖ హాస్యనటుడి కన్నుమూత PTI February 29, 201
- ↑ హాస్య నటుడు కుమరిముత్తు కన్నుమూత Sakshi | Updated: March 01, 2016
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-01. Retrieved 2016-03-02.
- ↑ http://www.thehindu.com/entertainment/actor-kumarimuthu-dead/article8295354.ece