2016
సంవత్సరం
2016 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు సవరించు
జనవరి 2016 సవరించు
- జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
- జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
- జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
- జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
- జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
- జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.
ఫిబ్రవరి 2016 సవరించు
మార్చి 2016 సవరించు
ఏప్రిల్ 2016 సవరించు
మే 2016 సవరించు
జూన్ 2016 సవరించు
జూలై 2016 సవరించు
ఆగస్టు 2016 సవరించు
సెప్టెంబర్ 2016 సవరించు
- భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.
అక్టోబర్ 2016 సవరించు
నవంబర్ 2016 సవరించు
- నవంబర్ 9: భారతప్రభుత్వం ఇంతవరకు చెలామణీలో ఉన్న 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో కొత్త 500 రూపాయలు, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నల్లధనాన్ని అరికట్టడానికి ఈ చర్య చేపట్టినట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.
డిసెంబర్ 2016 సవరించు
మరణాలు సవరించు
- జనవరి 2: ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
- జనవరి 4: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
- జనవరి 7: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
- జనవరి 10: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్, రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
- జనవరి 10: పి.ఆర్.రాజు, చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
- జనవరి 11: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
- జనవరి 11: పల్లెంపాటి వెంకటేశ్వర్లు పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927)
- జనవరి 13: అద్దేపల్లి రామమోహనరావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
- జనవరి 13: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
- జనవరి 14: మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)
- జనవరి 16: అనిల్ గంగూలీ, బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)
- జనవరి 17: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
- జనవరి 19: అరూన్ టికేకర్, సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
- జనవరి 19: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
- జనవరి 19: యసుటారో కొయిడే, 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
- జనవరి 20: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
- జనవరి 20: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
- జనవరి 21: మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి. (జ.1918)
- జనవరి 21: పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (జ.1914)
- జనవరి 22: పండిట్ శంకర్ ఘోష్, భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
- జనవరి 23: ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్. (జ.1937)
- జనవరి 25: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి. (జ.1965)
- జనవరి 28: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు. (జ.1935)
- జనవరి 28: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
- జనవరి 30: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (జ.1930)
- జనవరి 30: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- జనవరి 30: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
- ఫిబ్రవరి 3: బలరామ్ జక్కర్ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
- ఫిబ్రవరి 5: ఎ.జి.కృష్ణమూర్తి, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
- ఫిబ్రవరి 6: [[::en:Sudhir Tailang|సుధీర్ తైలాంగ్]], పద్మశ్రీ పురస్కారం పొందిన భారతీయ కార్టూనిస్ట్. (జ.1960)
- ఫిబ్రవరి 9: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (జ.1939)
- ఫిబ్రవరి 12: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
- ఫిబ్రవరి 12: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
- ఫిబ్రవరి 25: ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (జ.1930)
- మార్చి 4: [[::en:P. A. Sangma|పి.ఎ.సంగ్మా]], లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)
- మార్చి 4: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. (జ.1944)
- మార్చి 6: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)
- మార్చి 22: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939)
- మార్చి 24: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
- మార్చి 26: పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950)
- మార్చి 29: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. ( జ.1941)
- మే 7: బోయ జంగయ్య, రచయిత. (జ.1942)
- జూన్ 3: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్. (జ.1942)
- జూన్ 21: గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (జ.1955)
- జూన్ 22: జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
- జూన్ 24: నీల్ ఓబ్రీన్, భారతదేశంలోపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.
- జూలై 3: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (జ.1975)
- జూలై 8: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (జ.1928)
- జూలై 28: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (జ.1926)
- ఆగస్టు 7: దూబగుంట రోశమ్మ, 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ.
- ఆగస్టు 11:యాదాటి కాశీపతి అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత.
- ఆగస్టు 11:ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్య రచయిత. (జ.1940)
- సెప్టెంబరు 14: కార్టూనిస్టు, నాటక కర్త, వ్యంగ్య రచయిత (జ.1945)
- సెప్టెంబరు 16: బొజ్జా తారకం, హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)
- అక్టోబరు 18: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా పేరొందిన రచయిత. (జ.1952)
- అక్టోబరు 28: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (జ.1935)
- నవంబర్ 22: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (జ.1930)
- డిసెంబరు 11: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (జ. 1946)
- డిసెంబరు 13: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1922)
- డిసెంబరు 29: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)