కుమ్మరి చక్రం
కుమ్మరి, మట్టి పాత్రలను గుండ్రని చక్రం ఆకారంలో తయారు చేయడానికి ఉపయోగించే యంత్రం కుమ్మరి చక్రం. ఈ చక్రంపై మట్టి పాత్రల తయారీ జరుగుతున్నప్పుడు పాత్రకు అవసరమైన దానికన్నా అదనముగా ఉన్న మట్టినీ గీకి వేయవచ్చు. ఇంకా ఈ చక్రంపై ఎండిన మట్టి పాత్రలకు ఉన్న అదనపు భాగాలను గీకెయ్యవచ్చు, ఛేదిత అలంకరణ చేయవచ్చు, రంగు వృత్తాలు వేయవచ్చు. పురాతన ప్రపంచం అంతటా విరివిగా కుమ్మరిచక్రము ఉపయోగించారు, కానీ పూర్వ కొలంబియన్ న్యూ వరల్డ్ లో తెలియదు, ఇక్కడ చుట్టడం, కొట్టడం వంటి పద్ధతుల ద్వారా కుండలను చేతితో చేశారు.
కుమ్మరిచక్రం ఒక్కొసారి కుమ్మరి లేత్ గా సూచింపబడవచ్చు. అయితే ఈ పదం మరొక రకమైన యంత్రానికి బాగా ఉపయోగిస్తారు, అది వేరువేరు ఆకారపు ప్రక్రియల కోసం ఉపయోగిస్తారు, కుమ్మర చక్రం వలె తిరుగు దీనిని లోహ, చెక్క వస్తువులను మలచడం కోసం ఉపయోగిస్తారు.
పదజాలము
మార్చుకుమ్మరి చక్రాన్ని కుమ్మరి సారె అని కూడా అంటారు. సంస్కృతాంధ్ర పదము ఘటచక్రము.