కుమ్ర ఈశ్వరీబాయి

కుమ్ర ఈశ్వరీబాయి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ కొలాం తెగకు చెందిన రాజకీయ నాయకురాలు.ఈమె 27 డిసెంబర్ 2020 న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది.[1].[2][3][4]

కుమ్ర ఈశ్వరీబాయి
కుమ్ర ఈశ్వరీబాయి


తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
27 డిసెంబర్ 2020

మాజీ యంపిపి ఇంద్రవెల్లి (2003-2006)

వ్యక్తిగత వివరాలు

జననం (1971-01-01) 1971 జనవరి 1 (వయసు 53)
గొలేటి,మండలం రెబ్బెన, కుంరం భీం ఆసిఫాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి కుమ్ర రాజు
నివాసం ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ భారతదేశం

జననం విద్య మార్చు

కుమ్ర ఈశ్వరీ బాయి 01 జనవరి 1971లో రెబ్బెన మండలంలోని గొలేటి గ్రామం కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదిమ గిరిజన కుటుంబంలోని (పీవిటిజీ) కొలాం తెగకు చెందిన ఆత్రం చిన్ను, అన్ను బాయి ఆదివాసీ దంపతులకు తేదీ: 01-జనవరి-1971 లో జన్మించింది. కుంరంభీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది.

రాజకీయ జీవితం మార్చు

కుమ్ర ఈశ్వరీబాయి 2001 లో జరిగిన యంపీటిసీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దొడంద యంపీటిసీ గా గేలుపొంది, 2003 సంవత్సరం నుండి 2006 వరకు ఇంద్రవెల్లి మండల అధ్యక్షురాలిగా సేవలందించింది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గోని చురుకైన పాత్ర పోషించింది. ఆమె సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిని కట్టబెట్టింది.సుధీర్ఘకాలం ఒక సామాన్య కార్యకర్తల పార్టీ కోసం పని చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం 2020లో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేటెడ్ పోష్టుకు ఎంపిక చేసి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంతో ఆమె 27 డిసెంబర్ 2020 లో బాధ్యతలు స్వీకరించింది.

ఆదివాసీ కొలాం సామాజిక వర్గానికి చెందిన మహిళా కావడంతో ఆదిలాబాద్ జిల్లా కొలాం సంఘం పెద్దలు ఆమెకు కొలాం సంఘానికి జిల్లా అధ్యక్షురాలిగా ఎంపిక చేసి పదవి భాధ్యతలు అప్పజేప్పడం జరిగింది. మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళాల స్థితిగతులను మెరుగు పరచడానికి, మహిళా సమస్యలను పరిష్కరించడం కోసం ముఖ్యంగా బాలికల పాఠశాల, బాలికల కళాశాలు, బాలికలు వసతిగృహాలను తనఖి చేసి వాళ్ళ సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించడం, మహిళలకు, యువతులకు విద్య ప్రాముఖ్యతను తెలియజేయడం తో పాటు మహిళలకు అనేక ప్రభుత్వ పథకాలపై, అవగాహన కల్పించింది.[5][6]. [7] [8]

మూలాలు మార్చు

  1. Desam, A. B. P. (2022-07-23). "ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు". telugu.abplive.com. Retrieved 2024-04-27.
  2. "తెలంగాణలో మహిళా కమిషన్‌ ఏర్పాటు.. తొలి చైర్ పర్సన్‌‌, సభ్యులు ఎవరంటే." Samayam Telugu. Retrieved 2024-04-27.
  3. Bharat, E. T. V. (2021-01-08). "'మహిళలు, శిశు సంక్షేమం, రక్షణ కోసం పనిచేస్తాం'". ETV Bharat News. Retrieved 2024-04-27.
  4. "పీవోని కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-06. Retrieved 2024-04-27.
  5. "విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించండి". Sakshi. 2023-03-21. Retrieved 2024-04-27.
  6. ABN (2024-01-19). "Kumaram Bheem Asifabad: సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-27.
  7. "చరవాణులకు బానిస కావొద్దు". EENADU. Retrieved 2024-04-27.
  8. telugu, NT News (2023-07-05). "కుమ్రం భీం స్ఫూర్తితోనే పట్టాలు". www.ntnews.com. Retrieved 2024-04-27.