ప్రధాన మెనూను తెరువు

ఆదిలాబాద్

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు మండలం లోని పట్టణం

ఆదిలాబాద్ పట్టణం, తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా,ఆదిలాబాద్ పట్టణ మండలానికి చెందిన పట్టణం.[3]

ఆదిలాబాద్
Countryభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఆదిలాబాద్ జిల్లా
సముద్రమట్టము నుండి ఎత్తు
264 మీ (866 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం1,17,167
 • ర్యాంక్1వది (జిల్లాలో) 9వది (తెలంగాణ రాష్ట్రంలో)
పిలువబడువిధము(ఏక)ఆదిలాబాదీ
భాషలు
 • అధికారికతెలుగు & ఉర్దూ
ప్రామాణిక కాలమానంUTC+5:30 (భా.ప్రా.కా)
PIN
వాహనాల నమోదు కోడ్TS-01[2]
లోక్‌సభ నియోజకవర్గంఆదిలాబాద్
శాసనసభ నియోజకవర్గంఆదిలాబాద్

ఇది ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా కేంధ్రం.[4] చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడింది.

పేరు వెనుక చరిత్రసవరించు

అదిలాబాదుకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది.[5] మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు.[6]

చరిత్రసవరించు

తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ పట్టణాన్ని సందర్శించి 1830లో పట్టణం పరిస్థితులు తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేశారు. పట్టణాన్ని యేదులాబాదుగా పేర్కొంటూ, ఇక్కడకు వచ్చే మార్గం ప్రమాదకరమైన అడవులతో నిండివుందన్నారు. పట్టణంలో అప్పటికే అన్ని పదార్థాలూ దొరికేవని, అన్ని పనులు చేసే పనివారూ ఉన్నారని కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది. ఊరివెలుపల ఒక బ్రహ్మచారులు, సన్యాసుల మఠం, ఊళ్ళో మరికొన్ని మఠాలు ఉండేవని వ్రాశారు. ఇచోడా మొదలుకొని వోణి అనే గ్రామం వరకూ ఆదిలాబాద్ సహా అప్పట్లో ముషోర్మల్క్ అనే దివాన్ పరిపాలనలో ఉండేది.[6]

రవాణాసవరించు

రైలు రవాణాసవరించు

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే యొక్క నాందేడ్ విభాగపు ముద్ఖేడ్-అదిలాబాద్ మార్గముపై నున్నది. దీని స్టేషన్ కోడ్: ADB

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "District Census Handbook – Adilabad" (PDF). Census of India. p. 14,38. Retrieved 19 September 2015.
  2. "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014. Cite web requires |website= (help)
  3. "ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్". ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం. Retrieved 11 January 2015.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  5. ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర
  6. 6.0 6.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ సంపాదకులు.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆదిలాబాద్&oldid=2681175" నుండి వెలికితీశారు