కురింజి (Strobilanthes kunthiana) అనేది దక్షిణ భారత దేశంలో సముద్రమట్టానికి 1800 మీటర్ల ఎత్తులో పడమటి శ్రేణుల్లో షోలా గడ్డి నేలల్లో ఎదిగే ఒక పొద. కురింజి పొదలు 8 నుండి 10 అడుగుల ఎత్తు ఎదుగుతాయి. ఊదా-నీలం రంగులో ఉండే పువ్వులు గంట ఆకారంలో ఉండి గుత్తులుగా 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పిస్తాయి. కురింజి పొదలు ఎక్కువగా నీలగిరి కొండల్లో కనిపిస్తాయి. వీటి పువ్వుల రంగు కారణంగా నీలగిరి కొండలకు పేరు సార్ధకమైయ్యింది. సాధారణంగా ఆగష్టు నుండి అక్టోబరు నెల వరకూ పూస్తాయి. తమిళనాడులో ఊటి, కొడైకెనాల్ లోను, కేరళలో మునర్, ఇదుకి లోను కనిపిస్తాయి. కురింజి పొదల్లో 250 జాతులు ఉండగా 46 జాతులు భారతదేశంలోనే కనిపిస్తాయి. తూర్పుకనుమల్లో షెవరాయ్ షిల్స్ లో కూడా కనిపిస్తాయి. పాలియన్ తెగవారు ఈ పువ్వులను ఆధారంగా చేసుకొని వారి వయసును లెక్కించేవారు.

కురింజి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
S. kunthiana
Binomial name
Strobilanthes kunthiana
(Nees) T. Anderson

సాహిత్య ఉటంకింపులు

మార్చు

సంగం సాహిత్యంలో కురింజి పుష్పాలు ఇద్దరు ప్రేమికుల కలయికకు గుర్తు అని పేర్కొన్నాయి. హిందూ పురాణాల ప్రకారం శివుడి రెండవ కుమారుడైన మురుగన్ వేద అనే తెగకు చెందిన వల్లి అనే అమ్మాయిని పెళ్ళిచేసుకొని కురింజి దండను వేసుకొన్నాడు. వాల్మీకి రామాయణంలో నీలగిరుల ప్రస్తావన ఉంది. కూనూరుకి మూడు కిలోమీటర్ల దూరాన హులికల్ దుర్గ్ ఉంది. ఇది బకాసురుడు నివసించిన ప్రదేశం అని చెబుతారు. కూనూర్ నుంచి లాంబ్స్ రాక్‌కెళ్లే మధ్యలోనే కనిపిస్తుంది లేడీ కేనింగ్స్ సీట్. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ భార్య లేడీ కేనింగ్. ఆమె నీలగిరుల్లో విహారానికి వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ సేపు గడిపేది. దాంతో ఈ ప్రదేశానికి లేడీ కేనింగ్స్ సీట్‌గా నామకరణం చేసేశారు. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ విస్తారమైన టీ తోటలు, వాటి మీదుగా కనుచూపు మేరలో లాంబ్స్ రాక్, డ్రూంగ్, లాంప్‌టన్స్ పీక్ కనిపిస్తాయి. వీటితోపాటు దూరంగా మెట్టుపాలయం రోడ్డు కూడా కనిపిస్తుంది. ఆ దారి వెంట ఊటీ చేరగానే బొటానికల్ గార్డెన్ స్వాగతం పలుకుతుంది. ఇది అరవై ఎకరాల ఉద్యానవనం.

మున్నార్ కురింజి పూల నిలయం

మార్చు

దక్షిణ భారతదేశపు హిమాలయ ప్రాంతంగా పిలవబడే మున్నార్‌ కేరళలో సముద్ర మట్టానికి 1,600 అడుగుల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో ఉంది. మున్నార్‌ అంటే మలయాళంలో మూడు నదులు అని అర్ధం. ముద్రపూజ, నల్లతాని, కుందల నదుల మధ్యలో ఈ ప్రదేశం ఉంటుంది మున్నార్‌లోనే అనైముడి పర్వతం ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన ప్రదేశం ఇది. దీని ఎత్తు 2,695 మీటర్లు. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వేసవి విడిదిగా ఎంచుకున్న ఈ మున్నార్‌ ప్రాంతం అప్పటి నుంచే అభివృద్ధిలో ఉంది. అచ్చంగా ఆకాశాన్ని అంటుకున్నట్టుంటుందీ పర్వతం. అక్కడి నుంచి లక్కం వాటర్‌ఫాల్స్‌ దగ్గరే. పెద్ద శబ్దంతో అంతెత్తులోనుంచి అగాధంలోకి పడే అన్ని నీళ్ళు చూస్తుంటే ఆకాశానికి చిల్లుపడిందా అనిపిస్తుంది. చివరగా ఎరవికులం నేషనల్‌ పార్క్‌ వుంటుంది అక్కడ ఓ కొండ ప్రాంతంలో స్ట్రోబిల్లస్‌ కుంతియానమ్‌ లేదా నీలకురింజి అనే నీలిరంగు పూలు చాలా అరుదుగా పూస్తాయి.

మున్నార్ ఎలా చేరుకోవాలి

మార్చు

కొచ్చిన్‌ నుంచి మున్నార్‌ 130 కిలోమీటర్లు. కార్లు, క్యాబ్‌లు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో వుంటాయి. మూడు మూడున్నర గంటల ప్రయాణం.

గౌరవం

మార్చు

భారతీయ పోస్టల్ శాఖ వారు 2006 లో మే 29 న కురింజి పువ్వులు బొమ్మగా కలిగిన స్టాంపును విడుదల చేశారు.

కురింజి ఆలయం

మార్చు

కురింజి అండవర్ ఆలయం కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ఈ అరుదైన కురింజి పూలు, ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రాంతంలో ఆలయంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్ళి చేసుకుంది, ఈ అమ్మాయిని లేడీ రామనాథన్ అంటారు. ఈ ఆలయం ఇపుడు అరుల్మిఘు దండయుతపాణి స్వామి తిరు కోవిల్ క్రింద ఉంది.

కురింజి రాగం

మార్చు

29 శంకరాభరణం జన్య

ఆ::స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవ::ద2 ప మ1 గ3 రి2 స ని3 స
  • ఉదాహరణ 1 అన్నమాచార్య కీర్తన

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

  • ఉదాహరణ 2 బ్రూహి ముకుందేతి (సదాశివ బ్రహ్మేంద్ర, రాగం కురింజి)

పల్లవి: బ్రూహి ముకుందేతి రసనే

చరణాలు: కేశవ మాథవ గోవిదేతి కృశ్నానంద సదానందేతి

రాధారమణ హరేరామేతి రాజీవాక్ష ఘనశ్యామేతి

గరుఢగమన నందకహస్తేతి ఖండిత దశకంఠామస్తేతి

అక్రూరప్రియ చక్రధరేతి హంసనిరంజన కంస హరేతి

లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కురింజి&oldid=2984330" నుండి వెలికితీశారు