కొడైకెనాల్ తమిళనాడులో, పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న అందమైన వేసవి విడిది. భారతదేశంలో పేరు పొందిన వేసవి విడుదుల్లో ఒకటి.

  ?కొడైకెనాల్
తమిళనాడు • భారతదేశం
View of కొడైకెనాల్, India
View of కొడైకెనాల్, India
అక్షాంశరేఖాంశాలు: 10°14′N 77°29′E / 10.23°N 77.48°E / 10.23; 77.48
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
21.45 కి.మీ² (8 చ.మై)
• 2,133 మీ (6,998 అడుగులు)
జిల్లా (లు) డిండిగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
32,931 (2001 నాటికి)
• 1,535/కి.మీ² (3,976/చ.మై)
• M 51% F 49%
డిప్యూటీ కమీషనర్ ఆర్.వాసుకి, ఐ.ఏ.ఎస్
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 624601
• +240 - 242
• TN 57
వెబ్‌సైటు: www.dindigul.tn.nic.in/aboutdgl.htm
ఈ-మెయిల్: collrdgl@tn.nic.in

కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉంది. దీనికి దక్షిణంగా 120 కి.మీ. దూరంలో మదురై, పడమరగా 64 కి.మీ. దూరంలో పళని, ఉత్తరంగా 99 కి.మీ. దూరంలో దిండిగల్ ఉన్నాయి. కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మదురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు ప్రయాణం ద్వారా కొడైకెనాల్ చేరుకోవచ్చు.

చరిత్ర

మార్చు

కొడైకెనాల్ బస్ స్టాండును ఆనుకుని హోటళ్ళు చాలా ఉన్నాయి. రోజుకు 250 రూపాయల నుండి, వేయి రూపాయల వరకు గదులు అద్దెకు దొరికే హోటళ్ళు ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గరనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ వారి కార్యాలయము ఉంది. అక్కడ బస చేయటానికి అనువైన హోటళ్ళ వివరాలు, కొడైకెనాల్లో చూడదగ్గ ప్రదేశాల వివరాలు లభిస్తాయి.

చూడదగ్గ పరిసర ప్రదేశాలు

మార్చు
  • కొడై సరస్సు: కోడైకెనాల్ పట్టణ కేంద్రానికి చేరువలో 1863 లో కట్టిన మానవనిర్మిత కొడై సరస్సు ఉంది. 45 హెక్టార్లలో (60 ఎకరాల్లో) విస్తరించి ఉన్న ఈ సరస్సు ఒక వైపు అరచెయ్యి మాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతి వేళ్ళ మాదిరిగా సన్నని పాయలుగా వుంటుంది. ఈ సరస్సులో బోటు షికారు కూడా ఉంది.
 
కొడై సరస్సు
  • కోకర్స్ వాక్: ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలి బాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే, చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి.
  • సెయింట్ మేరీ చర్చి: ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం కొడైకెనాల్ లో నిర్మించబడిన మొట్ట మొదటి చర్చి. ఈ చర్చిలో నగిషీ పని బాగా ఉంది.
  • పంపార్ జలపాతం: ఈ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహించు కుంటూ వస్తున్న సన్నని వాగు ఇది.
  • గ్రీన్ వ్యాలీ వ్యూ: ఒక కొండ అంచున మనం నిలబడి చూడటానికి వీలుగా ఒక ప్లాట్ ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
  • గుణ గుహ: రోడ్డు అంచులో వున్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి కిందకు దిగుతూ వెళితే, ఒక చిన్న కొండ యొక్క అడుగు భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. కాని మనం దాని దగ్గరగా వెళ్ళి చూడటం కుదరదు. అక్కడకు వెళ్ళటానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసారు.స్థానికులు దీనిని దయ్యాల గుహ అని పిలుస్తారు.
  • పైన్ వృక్షాల అరణ్యం: కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ జరిగింది.
  • శాంతి లోయ:ఇది దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ.
  • కురింజి ఆండవర్ ఆలయం: ఈ దేవాలయము కోడైకెనాల్ కు దూరంగా ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. 1930 వ సంవత్సర ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండిన ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కలలో కనిపించి ఆశీర్వదించాడట. దానికి కృతజ్ఞతగా ఆవిడ ఈ దేవాలయం నిర్మింప చేసిందని స్థానికులంటారు. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదారంగు పూలు పూచే కురింజి పొదల వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది.

రవాణా విశేషాలు

మార్చు

విమానం ద్వారా అయితే, మదురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లికి విమానంద్వారా చేరుకుని, అక్కడ నుండి టాక్సీలో వెళ్ళ వచ్చు. రైలు ద్వారా అయితే, చెన్నై నుండి మధురై వేళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్డు స్టేషను కాని, దిండిగల్ కాని చేరుకుని వెళ్ళ వచ్చు.