కుర్రాడు 2009లో విడుదలైన తెలుగు సినిమా. ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు గున్నం సందీప్ దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, నేహా శర్మ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు.[2]

కుర్రాడు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం గున్నం సందీప్
తారాగణం వరుణ్ సందేశ్, నేహా శర్మ,[1] తనికెళ్ళ భరణి, ఆలీ, ఎమ్.ఎస్.నారాయణ
సంగీతం అచ్చు రాజమాని
సంభాషణలు తోట ప్రసాద్
నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ 12 నవంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

  • దర్శకత్వం:సందీప్ గున్నం
  • స్టూడియో: ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్
  • నిర్మాత: పి.కిరణ్;
  • స్వరకర్త: అచ్చు రాజమణి
  • విడుదల తేదీ: నవంబర్ 12, 2009

కథ సవరించు

వరుణ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతను బైక్‌ల పట్ల మక్కువ కలిగి ఉంటాడు. బైక్‌ను సొంతం చేసుకోవడం అతని కల. వరుణ్ ఒక బైక్ కొని, బ్యాంకులో రికవరీ ఏజెంట్ ఉద్యోగం పొందడానికి సానుకూలంగా ఉపయోగిస్తాడు. ఆ పని చేయడానికి బైక్ కలిగి ఉండటం అతనికి అవసరం. అతని బైక్ ఒక రాత్రి సమయంలో దొంగిలించబడింది. తరువాత అతను దొంగిలించబడిన బైక్ ను గుర్తించి, అది డోప్ స్మగ్లర్ల ముఠాతో ఉందని తెలుసుకుంటాడు. తన బైక్‌ను తిరిగి పొందగలిగే విధానం మిగిలిన కథ.

మూలాలు సవరించు

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. "Kurradu (2009)". Indiancine.ma. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కుర్రాడు&oldid=3277371" నుండి వెలికితీశారు