ఎం. ఎస్. నారాయణ

తెలుగు సినిమా హాస్య నటుడు
(ఎమ్.ఎస్.నారాయణ నుండి దారిమార్పు చెందింది)

ఎం. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1947 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు, రచయిత. సుమారు 17 సంవత్సరాల కెరీర్లో దాదాపు 700 పైగా సినిమాల్లో నటించాడు.[1] చదువుకునే రోజుల నుంచీ హాస్య రచనలు చేస్తూండేవాడు. కొన్ని నాటకాలు రాశాడు. దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మా నాన్నకి పెళ్ళి (1997).[2] అందులో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించాడు. తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో మరణించాడు.

ఎమ్. ఎస్. నారాయణ
జననం
మైలవరపు సూర్యనారాయణ

(1947-08-14)1947 ఆగస్టు 14
మరణం2015 జనవరి 23(2015-01-23) (వయసు 67)
హైదరాబాదు
విద్యభాషా ప్రవీణ
విద్యాసంస్థప్రాచ్య కళాశాల, పత్తేపురం
వృత్తిఅధ్యాపకుడు, రచయిత, నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామికళాప్రపూర్ణ
పిల్లలువిక్రమ్, శశికిరణ్
తల్లిదండ్రులుమైలవరపు బాపిరాజు (తండ్రి), వెంకటసుబ్బమ్మ (తల్లి)

నేపథ్యం

మార్చు

గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.[3]

వ్యక్తిగత జీవితము

మార్చు

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.

పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్‌ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు. తన క్లాస్‌మేట్‌ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్ళి చేయించడం విశేషం.

వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు. తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు. 2015 లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

నాటకాలు

మార్చు

తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్‌ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు.[4]

సినీ ప్రస్థానము

మార్చు

1995లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టితో రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా ఎమ్ ధర్మరాజు ఎం. ఏ. అవకాశం కల్పించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి (సినిమా) చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్ళి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.[4]

పేరు పడ్డ సంభాషణలు

మార్చు

తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు

మార్చు

ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు (రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.

చలన చిత్ర ప్రస్థానము

మార్చు

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2017 నేనోరకం చివరిగా నటించిన సినిమా
2016 శంకర[5]
2015 పటాస్ సునామీ సుభాష్
లవ్ స్టేట్స్
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
నేను నా ప్రేమకథ
2014 జంప్ జిలాని[6]
అమృతం చందమామలో
పాండవులు పాండవులు తుమ్మెద
యమలీల 2
నాయక్
రఫ్‌
2013 కెవ్వు కేక[7]
చండీ
జై శ్రీరామ్ (2013)[8]
మిస్టర్ పెళ్ళికొడుకు
షాడో (2013 సినిమా)
దూకుడు (సినిమా)
సేవకుడు నారాయణ
2012 దేవరాయ
అధినాయకుడు
తూనీగ తూనీగ
2011 తెలుగమ్మాయి
గ్రాడ్యుయేట్
క్రికెట్ గర్ల్స్ & బీర్
2010 ఆలస్యం అమృతం
తిమ్మరాజు
బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం
నాగవల్లి[9] పాములు పట్టే వ్యక్తి
మనసారా
ఏమైంది ఈవేళ
సరదాగా కాసేపు
తకిట తకిట
2009 ఆ ఒక్కడు[10][11]
పదహారేళ్ళ వయసు
మనోరమ
మిస్టర్ గిరీశం
2008 భజంత్రీలు దర్శకుడు
యమదొంగ అతిథి పాత్ర
రెయిన్‌బో నారాయణ
ఆదివిష్ణు
2007 ఆపరేషన్ దుర్యోధన
2006 భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము.
కోకిల
2005 ఎవడి గోల వాడిది పూర్తి హాస్య చిత్రం
అదిరిందయ్యా చంద్రం
2004 24 గంటలు
అంజలి ఐ లవ్యూ
ఆంధ్రావాలా[12]
ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి
ఐతే ఏంటి
ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి
మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
నేనున్నాను
143[13][14]
2003 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
నేను పెళ్ళికి రెడీ
శ్రీరామచంద్రులు
శివమణి అతిథి పాత్ర
మిస్సమ్మ (2003 సినిమా)
2002 ఇడియట్ అధ్యాపకుడు
అల్లరి రాముడు
ఒకటో నంబర్ కుర్రాడు
రాఘవ
2001 నువ్వు నాకు నచ్చావ్
డార్లింగ్ డార్లింగ్
6 టీన్స్
అందాల ఓ చిలకా
9 నెలలు
శుభాశీస్సులు
కలిసి నడుద్దాం
2000 పాపే నా ప్రాణం
1999 సాంబయ్య
ఫిల్మ్ నగర్
1998 పవిత్ర ప్రేమ
1997 ఆరో ప్రాణం

పురస్కారాలు

మార్చు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్‌లో గల కిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.

మూలాలు

మార్చు
  1. ""ఎంఎస్ నారాయణ ఇకలేరు.."". www.sakshi.com. సాక్షి. 23 January 2015. Retrieved 23 January 2015.
  2. Codingest. "నవ్వుల నారాయణ". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 2021-02-09. Retrieved 2021-02-12.
  3. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.[permanent dead link]
  4. 4.0 4.1 http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731[permanent dead link]
  5. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  7. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
  8. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
  9. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
  10. Idlebrain, Movie Review (5 June 2009). "Aa Okkadu review". www.idlebrain.com. Archived from the original on 12 December 2019. Retrieved 30 May 2020.
  11. Great Andhra, Movie Review (5 June 2009). "'Aa Okkadu' Review: Not Upto Expectations". greatandhra.com (in ఇంగ్లీష్). Venkat Arikatla. Retrieved 30 May 2020.[permanent dead link]
  12. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  13. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  14. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.

బయటి లింకులు

మార్చు