కుల్దీప్ సింగ్ ధాలివాల్
కుల్దీప్ సింగ్ ధాలివాల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆజ్ఞల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
కుల్దీప్ సింగ్ ధాలివాల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 21 మార్చి 2022 | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
---|---|---|---|
ముందు | మాన్ ప్రీత్ సింగ్ బాదల్ | ||
నియోజకవర్గం | ఆజ్ఞల | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 10 మార్చి 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతదేశం |
రాజకీయ జీవితం
మార్చుకుల్దీప్ సింగ్ ధాలివాల్ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1990లో కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసి అమెరికాకు వెళ్లి స్థిర పడ్డాడు. ఆయన తరువాత భారత్ తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడిగా, పంజాబ్ స్టేట్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్గా పనిచేశాడు. కుల్దీప్ సింగ్ ధాలివాల్ అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అమృత్సర్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[2]
కుల్దీప్ సింగ్ ధాలివాల్ 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆజ్ఞల నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై భగవంత్ మాన్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
- ↑ Zee News (19 March 2022). "Meet AAP's Kuldeep Singh Dhaliwal, Cabinet Minister in Bhagwant Mann's govt" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.