కూడంకుళం తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా లోని గ్రామం. ఇది కన్యాకుమారికి ఆగ్నేయంగా 20 కి.మీ దూరంలోనూ, నాగర్ కోయిల్ కి 30 కి.మీ దూరంలోనూ, తిరునల్వేలికి 70 కి.మీ లోనూ, తిరువనంతపురంకి 105 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. అలాగే ఇక్కడ పవన్ విద్యుత్ కూడా విస్తారంగా ఉత్పత్తి అవుతోంది. మొత్తం 2000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ కేంద్రాలతో కూడంకుళం, భారతదేశంలో పవన్ విద్యుత్తును అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.[1]

కూడంకుళం
—  గ్రామం  —
రాష్ట్రం తమిళనాడు
జిల్లా తిరునల్వేలి
జనాభా (2011)
 - మొత్తం 12,957
 - పురుషులు 6,483
 - స్త్రీలు 6,474
తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళం వద్ద కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ (కెకెఎన్‌పిపి) యూనిట్లు 1 & 2 దృశ్యచిత్రం

జనాభా

మార్చు

2011 జనగణ ప్రకారం, గ్రామంలో మొత్తం జనాభా 12,957. ఇందులో పురుషులు 6,483 కాగా స్త్రీలు 6,474.

వివాదాలు

మార్చు

అణువిద్యుత్ కేంద్రంలోని భద్రతా అంశాల విషయమై 2011 నుండి కూడంకుళం వివాదాల్లో నిలుస్తూ ఉంది. 2012 లో అణువిద్యుత్తు కర్మాగారానికి వ్యతిరేకంగా మానపాడు వద్ద జరిగిన ప్రదర్శనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు.[2]

చూడదగ్గ ప్రదేశాలు

మార్చు
  • అఖిలాండేశ్వరి ఆలయం
  • సెంట్ ఆన్ చర్చి
  • ముత్తురామన్ ఆలయం
  • వెలిపడత్త వీరాస్వామి ఆలయం
  • వెంకటాచలపతి పెరుమాళ్ ఆలయం
  • సూదలై మదన్ ఎసక్కియమ్మన్
  • సిఎస్‌ఐ చర్చి
  • అయ్య కోవెల

మూలాలు

మార్చు
  1. collective, 01:53 PM (13 May 2007). "Koodankulam Must be a Symbol of Prosperity". The South Asian. Archived from the original on 1 మే 2012. Retrieved 26 March 2012.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. September 10, Priyamvatha; September 10, 2012UPDATED:; Ist, 2012 22:50. "Kudankulam: Anti-nuclear protests turn violent, 1 killed in firing". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-15. Retrieved 2020-06-15. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కూడంకుళం&oldid=3262023" నుండి వెలికితీశారు