కూబర్ పెడీ
అదొక పట్టణం... దానికో ప్రత్యేకత ఉంది... అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు... భూగర్భంలో!
ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే అది ఉన్నది భూమి కింద!
ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు 'కూబర్ పెడీ'. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కి దగ్గర్లో ఎడారి నేలల కింద ఏర్పడిన ఈ పట్టణాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
ఉనికి
మార్చుకూబర్ పెడీ నగరం దక్షిణ ఆస్ట్రేలియా లోని నగరం. యిది స్టువర్ట్ హైవే లో గల అడిలైట్ నుండి ఉత్తరగా 846 కి.మీ ల దూరంలో గల నగరం. 2011 జనాభా ప్రకారం ఈ నగర జనాభా 1,695 (953 పురుషులు,742 స్త్రీలు, 275 ఇండిజెనస్ ఆస్ట్రేలియన్లతో కలిపి) ఈ నగరాన్ని ప్రపంచ స్ఫటిక రాజధాని గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో విలువైన స్ఫటికాల గనులు ఎక్కువగా ఉన్నాయి.
నేల క్రింది నగరం
మార్చుఈ నగరం "నేల క్రింది నగరం" గా కూడా పిలువబడుతుంది. ఈ నగరాన్ని నేలక్రింద నిర్మించారు. దీనికి కారణం దహించే పగటి ఉష్ణం నుండి రక్షించుకొనుటకు కొరకు.కూబర్ పెడీ అనే పదం ‘కుప-పిటి’ అనే మాట నుంచి వచ్చింది. అంటే ‘వైట్‌మ్యాన్స్ హోల్’, ‘వాటర్ హోల్’ అనే అర్థాలున్నాయి. 1915లో విల్లీ హషిన్సన్ అనే వ్యక్తి... అక్కడ ఒపెల్ అనే విలువైన రాళ్లు అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. తర్వాత ఆ విషయంపై పలు పరిశోధనలు జరిగాయి. విల్లీ చెప్పినట్లుగా అక్కడ ఒపెల్ గనులు ఉన్నట్లు నిర్ధారణయ్యింది.[1] కూబర్ పెడీ లో విలువైన రాళ్ళను మొదట ఫిబ్రవరి 1, 1915 న కనుగొన్నారు. అప్పటి నుండి ఈ నగరం ప్రపంచానికి విలువైన వజ్రాల నాణ్యత గల రాళ్ళను అందుస్తుంది.
దాంతో 1916 నుంచీ ఒపెల్ తవ్వకాలు మొదలయ్యాయి. 1999 నాటికి ఆ ప్రదేశమంతా డ్రిల్ చేసి, ఒపెల్ రాళ్లను తవ్వేశారు. దాంతో గనులు తరిగిపోయాయి. దాదాపు పదిహేను మీటర్ల లోతు గల పెద్ద పెద్ద గోతులు మిగిలాయి. ఇవే తర్వాతి కాలంలో నివాస స్థలాలుగా మారాయి.[2]
ప్రజలు
మార్చుప్రస్తుతం కూబర్ పెడీ జనాభా సుమారు రెండు వేలు. వీరిలో తొంభై శాతం మంది భూగర్భ గృహాల్లోనే నివసిస్తున్నారు. ఈ గృహాలను వాళ్లు డగౌట్స్ అని పిలుచుకుంటారు. అలా నివసించడం ఇష్టంలేని వాళ్లు కాస్త దూరంగా నేలమీద గృహాలు నిర్మించు కున్నారు. భూగర్భంలో ఇళ్లంటే ఏదో ఓ మాదిరిగా ఉంటాయనుకోవద్దు. చాలా ఆధునికంగా, విలాసవంతంగా ఉంటాయి. ప్రతి ఇంటికీ మూడు పడక గదులతో పాటు వంటగది, బాత్‌రూమ్, లాంజ్ ఉంటాయి.
నేల నుండి గుంతల్లోనికి దిగడానికి మెట్లలా ఉంటాయి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి విశాలమైన సందులు ఉంటాయి. భూగర్భంలోనే వారికోసం ఓ చర్చ్, హోటల్, బుక్‌స్టాల్ కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికీ కరెంటు ఉంది. టీవీలు, రేడియోలు వంటివి ఉన్నాయి. చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీలతో పనిలేదు. ఈ మధ్యనే ప్రభుత్వం వీరికి కేబుల్, ఫోన్ కనెక్షన్లు కూడా ఏర్పాటుచేసింది. వారానికోసారి పక్కనున్న పట్టణాల నుంచి కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం వంటివన్నీ వస్తాయి.
ఆ రోజే అందరూ బయటికి వచ్చి వారానికి కావలసినవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. హోటల్ ఎలాగూ ఉండనే ఉంది. మొత్తంగా వాళ్లకు ఏ లోటూ లేదనే చెప్పాలి. ‘‘మితిమీరిన ఉష్ణోగ్రత కారణంగా మేమీ ఏర్పాటు చేసుకున్నాం. దీనివల్ల మాకు ఏ ఇబ్బందీ లేదు. ఎలాంటి నష్టమూ లేదు. పైగా కాలుష్యం కూడా ఉండదు’’ అంటూ ఆనందంగా చెబుతున్నారు నివాసితులు.
కాకపోతే భూగర్భ గృహాలు కాబట్టి వీరు కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఇంట్లో అగ్నిప్రమాదం లాంటిది సంభవిస్తే మిగిలిన ఇళ్లు కూడా త్వరగా ప్రభావితమవుతాయి. అంతేకాక, చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ పారేయ కూడదు. ఒక్కసారి పురుగూ పుట్రా వచ్చా యంటే, వాటిని వదిలించుకోవడం అంత తేలిక కాదు. అందుకే చెత్తను మురిగి పోనివ్వకుండా నేలమీదికి వచ్చి, ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే పారబోస్తారు.
వేడిని తాళలేక వెతుక్కున్నఈ ప్రత్యామ్నాయ జీవనవిధానం ఎందరినో ఆశ్చర్యపరిచింది. మరెందరినో ఆకర్షించింది. 2006లో వచ్చిన ఒపల్ డ్రీమ్ చిత్రాన్ని ఇక్కడే తీశారు. అప్పట్నుంచీ ఇది మరింత పాపులర్ అయిపోయింది. ఓ వైవిద్యభరిత జీవనశైలికి ఊపిరి పోసిన కూబర్ పెడీ... ఏడాది పొడవునా వచ్చే సందర్శకులతో సందడి సందడిగా మారిపోయింది.
మూలాల జాబితా
మార్చుయితర లింకులు
మార్చుMedia related to Coober Pedy at Wikimedia Commons
- సాక్షి లో ఆర్టికల్
- Official website from The District Council of Coober Pedy & the Coober Pedy Retail Business & Tourism Association
- Photographs of Coober Pedy in 1994, National Library of Australia