ద్రావిడ భాష జాబితాల్లో ఒకటి కురుఖ్. దీనిని కుడఖ్ లేదా కుడుఖ్ అనీ వ్యవహరిస్తారు.

కురుఖ్ ఇది ఉత్తరభాష కుటుంబానికి చెందిన బ్రహయూ, మాల్తో భాషలలో ఒకటి. దీనిని ఓరయాను, ఓరాయాను, కురుంహా అని కూడా వ్యవహరిస్తారు. సాహిత్యం లేని భాషల్లో గోండీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఈ కుడుఖ్. ఈ భాష వాడుక కల ప్రాంతాలు

  1. బీహార్‌ లోని భాగల్పూర్, చోటా నాగపూర్, పలవన్, గంగాపూర్ ప్రాంతాలు
  2. ఒడిశా లోని సుందర్‌గడ్, సంభల్పూర్ ప్రాంతాలు
  3. మధ్యప్రదేశ్‌లోని రాయఘడ్, సర్గూజా ప్రాంతాలు

ఇతర విశేషాలు మార్చు

  • ఆయా ప్రాంతాల్లో ఈ భాష మాట్లాడు ప్రజలు సుమారు 12 లక్షలమంది ఉంటారని ఒక అంచనా. ఈ భాషపై పరిశోధించిన వారిలో రాబర్ట్ కాల్డ్వెల్ ఈ భాష మాట్లాడే వారిని "బుడాయన్‌లు" అంటారని పేర్కొన్నాడు.
  • 1900 సంవత్సరంలో కురుఖ్ గ్రామర్ (Kurukh grammer) అనే పుస్తకం రాసిన ఫెర్డినాండ్ హన్ ఈ భాషపై పరిశోధన చేసి ఈ భాషను అధికంగా మాట్లాడు ప్రాంతాలను పేర్కొన్నాడు.

మూలాలు, సమాచార సేకరణ గ్రంథాలు మార్చు

  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
  2. తెలుగుభాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి
  3. సమగ్రాంధ్ర సాహిత్యం - ఆరుద్ర