గోండి భాష దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో మొత్తంగా, సుమారు ముప్పై లక్షల మంది, ఈ భాషని మాట్లాడుతున్నారు[1]. ఇది గోండులకి చెందిన భాషే అయినప్పటికీ, ప్రస్తుతం వారిలో సగంమంది మాత్రమే దీనిని మాట్లాడుతున్నారు.

గోండీ  
:
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్,గుజరాత్
మాట్లాడేవారి సంఖ్య: 20 లక్షలు (మాతృభాష, భారత దేశం 2011)
భాషా కుటుంబము: ద్రవిడ
 దక్షిణ-మధ్య
  గోండీ 
వ్రాసే పద్ధతి: గోండీ లిపి, తెలుగు లిపి, దేవనాగరి లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: భారతదేశం
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2: gon
ISO 639-3: either:

ggo — దక్షిణ గోండి

gno — ఉత్తర గోండి

గోండీ భాషకు లిపి లేదని ఇటీవలికాలం వరకూ భావించారు. కొందరు ఔత్సాహికులు లిపిని ఏర్పరచడానికి ప్రయత్నించారు. అయితే, ఇవి సఫలం కాలేదు. ఇప్పటికీ గోండులు తెలుగు లిపి, దేవనాగరి లిపుల్లో గోండీని వ్రాస్తూ ఉన్నారు.

గోండీ భాషకు ఉన్న తనదైన సొంత లిపి ఇటీవలనే బయల్పడింది (ఆదిలాబాదు జిల్లా, గుంజాల వద్ద). ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసెర్చ్ సెంటర్ యొక్క మాజీ డైరక్టర్ జయధీర్ తిరుమలరావు గారు, ఈ లిపిలోని అనేక వ్రాతప్రతులను సేకరించారు. గోండులలో ఈ లిపిని పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి.[2]

మూలాలు

మార్చు
  1. Beine, David K. 1994. A Sociolinguistic Survey of the Gondi-speaking Communities of Central India. M.A. thesis. San Diego State University. chpt. 1
  2. Singh, S. Harpal (30 January 2013). "Chance discovery of Gondi script opens new vistas of tribal culture". The Hindu. Archived from the original on 2 ఫిబ్రవరి 2013. Retrieved 31 January 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=గోండీ&oldid=3969486" నుండి వెలికితీశారు