కూర్చోవడం
కూర్చోవడం లేదా ఆసీనులు కావడం విశ్రాంతి పొందుటకు మానవులు అవలంబించే ఒక చర్య. నేలపై గానీ లేదా ఏదైనా ఆసనం పై గానీ పిరుదులు ఆనించి కూర్చొని మనిషి సుఖానుభూతి పొందుతాడు.
సమాజంలో మర్యాద
మార్చుభారత దేశంలో ఎవరైనా మన ఇంటికి వచ్చినచో వారికి ఉచితాసనమేసి కూర్చో మనడం సామాజిక మర్యాద. అలా చేయకుంటే మర్యాద లేని వారుగా ముద్ర పడి పోతారు. ప్రభువులు, పెద్దలు మొదలగు వారి ఎదుట కూర్చోవడము పిన్న వయస్కులకు మర్యాద కాదు. అలా చేసిన పిన్న వయస్కులు మర్యాద లేని వారిగా మిగిలి పోతారు.
కూర్చోవడములో పద్ధతులు
మార్చుపిల్లలు బాసింపట్ల వేసి కూర్చుంటారు. గొంతుక కూర్చోవడము, ఒదిగి కూర్చోవడము, దర్పంగా కూర్చోవడము, పొందికగా కూర్చో వడము, ముండ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బందిగా కూర్చోవడము, పద్మాసనంలో కూర్చోవడము, కాళ్ళు బార్లా చాపి కూర్చోవడము, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము ఇలా కూర్చోవడంలో అనేక విధానాలున్నాయి. సందర్బాన్ని బట్టి కూర్చొనే విధానము వుంటుంది.
కూచుంటే జబ్బులు
మార్చుకూచొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఇలా పొద్దస్తమానం కూచుంటే సంపదలేమిటి? ఆరోగ్యమూ హరించుకుపోతుందటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఎక్కువసేపు కూచోవటం వల్ల కండరాల సంకోచ ప్రక్రియ తగ్గిపోయి, లైపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ పని చేయటం మానేస్తున్నట్టు కన్సాస్ స్టేట్ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది. ఈ ఎంజైమ్ మన శరీరంలోని కొవ్వు, ట్రైగ్లిజరైడ్లు శక్తిగా మారటంలో తోడ్పడుతుంది. ఈ విధంగా ఇది రోజంతా జీవనక్రియలు సజావుగా కొనసాగేలా చేస్తుంది. అయితే ఎక్కువసేపు కూచోవటం ద్వారా మనమే దీన్ని పనిచేయటం ఆపేయాలని శరీరానికి సూచించినట్టు అవుతోందని అధ్యయన కర్త రిచర్డ్ రోజెన్‌క్రాంజ్ చెబుతున్నారు. కూచోవటాన్ని తగ్గించి, తరచుగా అటూఇటూ తిరగటం ద్వారా ఈ ప్రక్రియలు తిరిగి పుంజుకునేలా చేయొచ్చని వివరిస్తున్నారు. ఫలితంగా గుండెజబ్బు, మధుమేహం, పక్షవాతం, రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ వంటి దీర్ఘకాల జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చనీ చెబుతున్నారు. నడక, వ్యాయామం వంటి వాటితోనే సరిపెట్టుకోకుండా.. కూచునే సమయాన్ని తగ్గించుకోవటమూ మేలని రిచర్డ్ సూచిస్తున్నారు. చాలాసేపు కూచొని పనిచేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి, కాస్త అటూఇటూ తిరిగినా మంచి ఫలితం కనబడుతుండటం గమనార్హమని చెబుతున్నారు. [1]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Emmanuel Stamatakis, PhD, MSc, BSc*,*, Mark Hamer, PhD, MSc, BSc* and David W. Dunstan, PhD, BAppSc, Screen-Based Entertainment Time, All-Cause Mortality, and Cardiovascular Events Archived 2012-05-11 at the Wayback Machine J Am Coll Cardiol, 2011; 57:292-299