కూలన్న
కూలన్న 1999లో విడుదలైన తెలుగు సినిమా. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కె.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. [1]
కూలన్న (1999 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.నారాయణమూర్తి |
తారాగణం | ఆర్.నారాయణమూర్తి, ఉజ్వల |
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆర్.నారాయణమూర్తి
- శిరీష్
- శకుంతల
- సంజీవి
- నర్రా
- రఘునాథరెడ్డి
- ఉజ్వల
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: సంజీవి
- సంగీతం: షేక్ ఇమామ్
- ఛాయాగ్రహణం: జి.చిరంజీవి
- కథ, స్క్రిన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
సమీక్ష
మార్చుఈ కథ రియలెస్టేట్ వ్యాపారంలో కూలీల బతుకుల గురించి. ఈ చిత్రంలో నక్సలిజం ఛాయలు లేవు. ఎటుతిరిగి కూలీలంతా ఎర్రజండా కింద ఏకవమడం మాత్రమే ఉంటుంది. ఈ చిత్రం ఉన్నవారి, లేనివారి మధ్య రగిలిన కార్చిచ్చుగా నడిచిందే తప్ప ఉగ్రవాదం పెరుతో గత చిత్రాల్లో వచ్చిన దూకుడు పతాక సన్నివేశాల్లో కనబడదు.
ఆర్ నారాయణమూఋతి ప్లాట్స్ కట్టే కూలీల నాయకుడిగా కొంత కథ నడిపించి, క్రమేపీ తమ్ముడు లేవదీసిన రగడలోకి దిగి, వీరి మధ్యలో నలిగిన తల్లి లక్ష్మమ్మ (శకుంతల) పాత్రకు ప్రాధాన్యమిస్తూ నడిపించాడు.
లక్ష్మమ్మ పెద్దకొడుకు కోటేశుగా నారాయణమూర్తి కూలీగా తన రెక్కలరగదీసుకుంటూ తమ్ముడు చదువుకి సాయపడుతూ కుటుంబ పోషన భారాన్ని మోస్తూ కదిలే పాత్ర. రాను రాను తమ్ముణ్ణీ దూరం చేసుకొనే పరిస్థితికి చేరుతుంది.
వైరి వర్గం ఉన్నవాళ్ళు ఓ మంత్రి రుద్రయ్య (దేవదాస్ కనకాల), అతని కొడుకు బాబ్జీ (జీవా) రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతూ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటారు. నిర్మాణంలో ఉన్న ఆడ కూలీలను తమ వాంఛలకు బలిచ్చే ప్రయత్నంలో కూలీలను మరింత ఇబ్బందుల పాల్చేసే సమయంలో ఓ వృద్ధ కూలీ చావుకు కారణమవుతారు. కూలీలు సమ్మెకట్టడం, విరమించడం వంటి వన్నీ ఆనవాయితీగా వచ్చే దృశ్యాలు.
మరో పక్కన కోటేశు తమ్ముడిని చేరదీసి రుద్రయ్య పోలీసు ఉద్యోగం ఇప్పించి ఒ క్వార్టర్ కూడా ఇవ్వడంతో తల్లి అన్న దగ్గరుండాలా, తమ్ముడు దగ్గరుండాలా నన్న మీమాంస తలెత్తి చివరికి పెద్దకొడుకును వదిలి చిన్నకొడుకుపంచన చేరుతుంది. రుద్రయ్య అతని మనుషులు పెట్టే బాధలు ఆ వూరికొచ్చిన ఓ మహిళా మునిసిపల్ కమీషనర్ కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆవిణ్ణీ చిత్ర హింసలు పెడతారు. కూలీలంతా ఎర్రబాట తొక్కి యాజమాన్యానికి ఎదురు తిరిగితే కోటేసు తమ్ముడు రుద్యయ్య కొమ్ము కాయడంతో కోటేశు ఎక్కడ చిన్నవాణ్ణీ చంపుతాడోనని, వారి తల్లి లక్ష్మమ్మ కోటేసునుండి చంపనని మాట తీసుకుంటుంది.
తరువాత లక్ష్మమ్మ ప్లాష్ బ్యాక్ లో కెళ్ళి తన చిన్నకొడుకు కథ చెబుతుంది. అతను తన కొడుకు కాదు. తన చెల్లెలి కొడుకు. లక్ష్మమ్మ భర్తని చంపి చివరికి శవాన్ని కూడా తగల పెట్టనీయని సందర్భంలో ఆ చెల్లి తన కొడుకుని లక్ష్మమ్మ కప్పచెప్పి రుద్రయ్య ముఠాని తరుముతుంది. శవదహనం తర్వాత లక్ష్మమ్మ తన కొడుతుతో పాటు ఈ పెంపుడు కొడుకుతో వెళ్ళిపోవడం, ఇక్కడ ఆవిడ చెల్లెలు రుద్రయ్యకు బలవడంతో ప్లాష్ బ్యాక్ కథ పూర్తి . చివరికి తేలింది లక్ష్మమ్మ గారాబం చెస్తున్న రెండో కొడుకు తన పెంపుడు కొడుకనీ రుద్రయ్యకి పుట్టినవాడనీ.
ఇట్లా కథ క్రమేపీ ఈ అన్నదమ్ముల కథగా మారడంతో యాజమాయం కార్మిక సంఘర్షణ కాస్తా పలచబడ్డా చివరికి ఇరువర్గాలు తలపడడం కోటేశుని చంపయోయే తమ్ముడిని తల్లి లక్ష్మమ్మె చంపడంతో కథ ముగుస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "Coolanna (1999)". Indiancine.ma. Retrieved 2020-08-24.