నర్రా వెంకటేశ్వర రావు

సినీ నటుడు

నర్రా వెంకటేశ్వర రావు ప్రముఖ తెలుగు నటుడు.[1] ఎక్కువగా సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రలలో నటించాడు. ముప్ఫై సంవత్సరాలకి పైగా నటనానుభవం కలిగిన ఆయన సుమారు 500 సినిమాలకు పైగా నటించాడు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, అగ్రహారం గ్రామం.

నర్రా వెంకటేశ్వర రావు
మాతృభాషలో పేరునర్రా వెంకటేశ్వర రావు
జననం1947
ప్రకాశం జిల్లా
మరణం2009 డిసెంబరు 27 (2009-12-27)(వయసు 62)
హైదరాబాద్
మరణానికి కారణంగుండెపోటు
నివాసంహైదరాబాదు
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1974-2009
మతంహిందూ
జీవిత భాగస్వామిసుశీల
పిల్లలుమురళి, వసంతలక్ష్మి

జీవిత విశేషాలుసవరించు

నర్రా వెంకటేశ్వర రావు 1947 లో ప్రకాశం జిల్లాలోని అగ్రహారం అనే గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించిన అనుభం ఆయనకుంది. ఆయన భార్య పేరు సుశీల. వారికి ఒక కొడుకు మురళి, ఒక కూతురు వసంతలక్ష్మి.

కెరీర్సవరించు

ఆయన 1974 లో చదువు సంస్కారం అనే సినిమా తో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆయన చివరి సినిమా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మేస్త్రి.

మరణంసవరించు

ఆయన డిసెంబరు 27, 2009 న 62 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు.

నటించిన సినిమాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. "Telugu Movie Actor Narra Venkateswara Rao". nettv4u.com. Retrieved 13 September 2016.