కృష్ణ గోపాల్ సక్సేనా

కృష్ణ గోపాల్ సక్సేనా (1912-2003) భారతీయ హోమియోపతిక్ వైద్యుడు.[1] 1912 సెప్టెంబరు 25న ఢిల్లీలో జన్మించిన అతను కరాచీ, అంబాలా లో పాఠశాల విద్యను పూర్తి చేసి, కలకత్తా హోమియోపతిక్ మెడికల్ కాలేజీ నుండి హోమియోపతిక్ మెడిసిన్ లో పట్టభద్రుడయ్యాడు.[1]

కృష్ణ గోపాల్ సక్సేనా
జననం912 సెప్టెంబరు 25
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
మరణంఅక్టోబరు 2003 (వయస్సు 91)
వృత్తిహోమియోపతి వైద్యుడు
భార్య / భర్తశకుంతల దేవి
పురస్కారాలుపద్మశ్రీ
ఎన్.సి.చక్రవర్తి మెమోరియల్ నేషనల్ పురస్కారం
ప్రెసిడెంట్ ఆఫ్ ఆనర్ పురస్కారం

సక్సేనా 1952లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోమియోపతిక్ రిఫరెన్స్ కమిటీకి మొదటి గౌరవ సలహాదారుగా ఉన్నాడు. భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గౌరవ వైద్యుడిగా పనిచేశాడు.[1]  1994 నుండి 1999 వరకు ఢిల్లీ ప్రభుత్వ హోమియోపతిక్ సలహా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు.[1] ఎన్. సి. చక్రవర్తి మెమోరియల్ నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ హోమియోపతి కాంగ్రెస్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ హానర్ అవార్డు గ్రహీత, సమాజానికి అతను చేసిన కృషికి గాను 1969లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[1][2][3]

సక్సేనా 2003 అక్టోబరులో మరణించాడు. ఆయన అప్పటి భార్య శకుంతలా దేవి.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

 

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Homoeopathe International". Homoeopathe International. 2004. Retrieved 12 May 2015.
  2. "Padma Awards Directory (1954-2013)" (PDF). Ministry of Home Affairs, India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
  3. "Padma Shri Awardees Doctors Forum". Padma Shri Awardees Doctors Forum. 2015. Archived from the original on 22 August 2015. Retrieved 12 May 2015.