కృష్ణ మండలం (నారాయణపేట జిల్లా)


కృష్ణ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[3] దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది 16.41° ఉత్తర అక్షాంశం, 77.33° తూర్పు రేఖాంశంపై ఉంది. ఇందులో 12 గ్రామాలున్నాయి.

కృష్ణ
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కృష్ణ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కృష్ణ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, కృష్ణ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం హిందూపూర్
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 161 km² (62.2 sq mi)
జనాభా
 - మొత్తం 23,133
 - పురుషులు 11,537
 - స్త్రీలు 11,596
పిన్‌కోడ్ {{{pincode}}}

నూతన మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ కృష్ణ (హిందూపూర్) గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట రెవెన్యూ డివిజను పరిధిలోని మాగనూరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కృష్ణ (హిందూపూర్) గ్రామాన్ని (0+12) పన్నెండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా,నారాయణపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు మార్చు

గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[5]

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 23,133. జనాభాలో పురుషులు 11,537 కాగా, స్త్రీల సంఖ్య 11,596. మండలంలో 4,506 గృహాలున్నాయి.[6]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కష్ణ
  2. తంగడి
  3. శుకుర్లింగంపల్లి
  4. కుసుమర్తి
  5. చేగుంట
  6. ఐనాపూర్
  7. కున్సి
  8. గుడెబెల్లూరు
  9. ముడుమాల్
  10. మురహరిదొడ్డి
  11. గురుజాల
  12. అలంపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  4. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  5. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు