నారాయణపేట జిల్లా
నారాయణపేట జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి. 2019 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1] (ఫిబ్రవరి 17, 2019 నుంచి జిల్లా పాలన అమలులోకి వస్తుంది) జిల్లాలో 11 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాలలో ఒకటైన లోకపల్లి సంస్థానకేంద్రంగా వర్థిల్లిన నారాయణపేట పట్టణం కొత్త జిల్లాకు కేంద్రస్థానం అయింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే.
చరిత్రసవరించు
లోకపల్లి సంస్థానం పాలనాధీశులు చాలా కాలం పాటు నారాయణపేట కేంద్రంగా పాలించారు. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశుల ప్రభావం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. సంస్థాన కాలం నాటి కోటలు, పురాతన భవనాలే కాకుండా ఇక్కడి ప్రజలపై మరాఠీ భాషా ప్రభావం కూడా ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైన ఈ ప్రాంతం 8 సం.ల పాటు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగించి.1956 నవంబరు 1 నుంచి 2014 జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ గా ఉంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా ఈ ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించి. ప్రత్యేక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన రావడంతో డిసెంబరు 31, 2018న నారాయణపేట రెవిన్యూ డివిజన్ లోని 11, కోయిలకొండ మండలంతో 12 మండలాలలో జిల్లా ఏర్పాటుకు ముసాయిదా ప్రకటన వెలువడింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కోయిలకొండ మండలాన్ని మహబుబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగిస్తూ మిగితా 11 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేసింది.[2]
జిల్లా లోని మండలాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు నారాయణపేట, ములుగు జిల్లాల ఆవిర్భావం".
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 19, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019