కృష్ణ మురారీ
కృష్ణ మురారీ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]
కృష్ణ మురారీ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 సెప్టెంబర్ 2019 | |||
సూచించిన వారు | రంజన్ గొగోయ్ | ||
---|---|---|---|
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
పంజాబ్ & హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 2 జూన్ 2018 – 22 సెప్టెంబర్ 2019 | |||
సూచించిన వారు | దీపక్ మిశ్రా | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | అజయ్ కుమార్ మిట్టల్ (తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి) | ||
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 7 జనవరి 2004 – 1 జూన్ 2018 | |||
సూచించిన వారు | వి. ఎన్. ఖరే | ||
నియమించిన వారు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అలాహాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1958 జూలై 9
జననం, విద్యాభాస్యం
మార్చుకృష్ణ మురారీ 1958 జూలై 9లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అలాహాబాద్ లో జన్మించాడు. ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1981 డిసెంబరు 23న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుకృష్ణ మురారీ 1981న న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి అలహాబాద్ హైకోర్టులో సివిల్, రాజ్యాంగ, కంపెనీ, రెవెన్యూ కేసులను వాదించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నూలు కంపెనీ, ఉత్తర రైల్వే ప్రాథమిక సహకార బ్యాంకు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వస్త్ర కార్పొరేషన్ మొదలైన వాటికి స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు. కృష్ణ మురారీ 2004 జనవరి 7న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితుడై 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఆయన 2018 జూన్ 2న పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడై[2] 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2023 జూలై 8 వరకు కొనసాగుతాడు.
మూలాలు
మార్చు- ↑ 10TV (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustan Times (27 April 2018). "Justice Krishna Murari set to be chief justice of Punjab and Haryana high court" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.