ఉత్తరప్రదేశ్

భారతీయ రాష్ట్రం

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

ఉత్తరప్రదేశ్

उत्तर प्रदेश
اتر پردیش
వారణాసి లో గంగా నది.
Coat of arms of ఉత్తరప్రదేశ్
Coat of arms
Location of Uttar Pradesh in India
Location of Uttar Pradesh in India
Map of Uttar Pradesh
Map of Uttar Pradesh
దేశంభారత్
ప్రాంతంఅవద్ , m:en:Baghelkhand, m:en:Braj, m:en:Doab m:en:Bundelkhand, m:en:Purvanchal, m:en:Rohilkhand, m:en:Indo-Gangetic Plain
EstablishedModern: 1805 (as Ceded and Conquered Provinces)
History
Summary
Capitalలక్నో
Districts75 total[1]
ప్రభుత్వం
 • నిర్వహణభారత ప్రభుత్వము, m:en:Government of Uttar Pradesh
 • గవర్నరుm:en:Anadi Ben Patel
 • Chief MinisterAditya yogi nadh ([Bharat Janata party [BJP]])
 • Legislaturem:en:Bicameral (404 + 108 seats)
 • Parliamentary constituency80
 • High Courtఅలహాబాద్ హైకోర్టు
విస్తీర్ణం
 • మొత్తం2,43,286 km2 (93,933 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు5th
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం199,581,477
 • ర్యాంకు1st
 • సాంద్రత820/km2 (2,100/sq mi)
పిలువబడువిధం (ఏక)Uttarpradeshi, UPite, Uttar Bharatiya, North Indian
కాలమానంUTC+05:30 (IST)
m:en:UN/LOCODEIN-UP
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుUP 01—XX
HDIIncrease 0.490 (low)
HDI rank32nd (2005)
Literacy69.72%
79.24% (male)
59.26% (female)
Official languageహిందీ
ఇంగ్లీష్
ఉర్దూ
జాలస్థలిupgov.nic.in

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)

ప్రాచీన చరిత్రసవరించు

గంగా యమునా పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.

ఇటీవలి చరిత్రసవరించు

అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయువ్యభాగాన్ని ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.

ప్రాంతాలుసవరించు

  • వాయువ్య ప్రాంతం - రోహిల్ ఖండ్
  • నైఋతి ప్రాంతం - డోఅబ్, బ్రిజ్ (వ్రజభూమి)
  • మధ్య ప్రాంతం - అవధ్ (ఓధ్)
  • ఉత్తర భాగం - బాగల్ ఖండ్, బుందేల్ ఖండ్
  • తూర్పు భాగం - పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం)

ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి ఆగ్రా, అజంగడ్, అలహాబాదు, కాన్పూర్, గోరఖ్‌పూర్ , చిత్రకూట్, ఝాన్సీ, దేవీపటణ్, ఫైజాబాద్, బాహ్రూచ్, బరేలీ, బస్తీ, మీర్జాపూర్, మొరాదాబాద్, మీరట్, లక్నో, వారాణసి, సహరాన్పూర్.

భాషలుసవరించు

హిందీ, ఉర్దూ - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "ఖరీబోలీ" (కడీబోలీ) భాష హిందీ, ఉర్దూ భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. లక్నోలో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, భోజపురి భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్ లలో విస్తరించి ఉన్నారు.

రాజకీయాలుసవరించు

భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాద్ .

ఉత్తర ప్రదేశ్ జిల్లాలుసవరించు

సంఖ్య కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1 AG ఆగ్రా ఆగ్రా 43,80,793 4,027 1,084
2 AL అలీగఢ్ అలీగఢ్ 36,73,849 3,747 1,007
3 AH అలహాబాద్ అలహాబాద్ 59,59,798 5,481 1,087
4 AN అంబేద్కర్ నగర్ అక్బర్‌పూర్ 23,98,709 2,372 1,021
5 AM అమేఠీ గౌరీగంజ్ 25,49,935 3,063 830
6 JP అమ్రోహా అమ్రోహా 18,38,771 2,321 818
7 AU ఔరైయా ఔరైయా 13,72,287 2,051 681
8 AZ ఆజంగఢ్ ఆజంగఢ్ 46,16,509 4,053 1,139
9 BG బాగ్‌పత్ బాగ్‌పత్ 13,02,156 1,345 986
10 BH బహ్‌రైచ్ బహ్‌రైచ్ 23,84,239 4,926 415
11 BL బలియా బలియా 32,23,642 2,981 1,081
12 BP బల్‌రాంపూర్ బల్‌రాంపూర్ 21,49,066 3,349 642
13 BN బాందా బాందా 17,99,541 4,413 404
14 BB బారాబంకీ బారాబంకీ 32,57,983 3,825 739
15 BR బరేలీ బరేలీ 44,65,344 4,120 1,084
16 BS బస్తీ బస్తీ 24,61,056 2,687 916
17 BH భదోహీ గ్యాన్‌పూర్ 15,54,203 960 1,531
18 BI బిజ్నౌర్ బిజ్నౌర్ 36,83,896 4,561 808
19 BD బదాయూన్ బదాయూన్ 37,12,738 5,168 718
20 BU బులంద్‌షహర్ బులంద్‌షహర్ 34,98,507 3,719 788
21 CD చందౌలీ చందౌలీ 19,52,713 2,554 768
22 CT చిత్రకూట్ చిత్రకూట్ 9,90,626 3,202 315
23 DE దేవరియా దేవరియా 30,98,637 2,535 1,220
24 ET ఎటా ఎటా 17,61,152 2,456 717
25 EW ఎటావా ఎటావా 15,79,160 2,287 683
26 FZ ఫైజాబాద్ ఫైజాబాద్ 24,68,371 2,765 1,054
27 FR ఫరూఖాబాద్ ఫతేగఢ్ 18,87,577 2,279 865
28 FT ఫతేపూర్ ఫతేపూర్ 26,32,684 4,152 634
29 FI ఫిరోజాబాద్ ఫిరోజాబాద్ 24,96,761 2,361 1,044
30 GB గౌతమ బుద్ద నగర్ నోయిడా 16,74,714 1,269 1,252
31 GZ ఘాజియాబాద్ ఘాజియాబాద్ 46,61,452 1,175 3,967
32 GP ఘాజీపూర్ ఘాజీపూర్ 36,22,727 3,377 1,072
33 GN గోండా గోండా 34,31,386 4,425 857
34 GR గోరఖ్‌పూర్ గోరఖ్‌పూర్ 44,36,275 3,325 1,336
35 HM హమీర్‌పూర్ హమీర్‌పూర్ 11,04,021 4,325 268
36 PN హాపూర్ హాపూర్ 13,38,211 660 2,028
37 HR హర్దోయీ హర్దోయీ 40,91,380 5,986 683
38 HT హాత్‌రస్ హాత్‌రస్ 15,65,678 1,752 851
39 JL జలౌన్ ఒరాయీ 16,70,718 4,565 366
40 JU జౌన్‌పూర్ జౌన్‌పూర్ 44,76,072 4,038 1,108
41 JH ఝాన్సీ ఝాన్సీ 20,00,755 5,024 398
42 KJ కన్నౌజ్ కన్నౌజ్ 16,58,005 1,993 792
43 KD కాన్పూర్ దేహత్ అక్బర్‌పూర్ 17,95,092 3,021 594
44 KN కాన్పూర్ కాన్పూర్ 45,72,951 3,156 1,415
45 KR కాస్‌గంజ్ కాస్‌గంజ్ 14,38,156 1,955 736
46 KS కౌశాంబి మంఝన్‌పూర్ 15,96,909 1,837 897
47 KU కుశినగర్ పద్రౌనా 35,60,830 2,909 1,226
48 LK లఖింపూర్ ఖేరి లఖింపూర్ 40,13,634 7,674 523
49 LA లలిత్‌పూర్ లలిత్‌పూర్ 12,18,002 5,039 242
50 LU లక్నో లక్నో 45,88,455 2,528 1,815
51 MG మహారాజ్‌గంజ్ మహారాజ్‌గంజ్ 26,65,292 2,953 903
52 MH మహోబా మహోబా 8,76,055 2,847 288
53 MP మైన్‌పురి మైన్‌పురి 18,47,194 2,760 670
54 MT మథుర మథుర 25,41,894 3,333 761
55 MB మౌ మౌ 22,05,170 1,713 1,287
56 ME మీరట్ మీరట్ 34,47,405 2,522 1,342
57 MI మీర్జాపూర్ మీర్జాపూర్ 24,94,533 4,522 561
58 MO మొరాదాబాద్ మొరాదాబాద్ 47,73,138 3,718 1,284
59 MU ముజఫర్ నగర్ ముజఫర్ నగర్ 41,38,605 4,008 1,033
60 PI ఫిలిభిత్ ఫిలిభిత్ 20,37,225 3,499 567
61 PR ప్రతాప్‌గఢ్ ప్రతాప్‌గఢ్ 31,73,752 3,717 854
62 RB రాయ్‌బరేలి రాయ్‌బరేలి 34,04,004 4,609 739
63 RA రాంపూర్ రాంపూర్ 23,35,398 2,367 987
64 SA సహారన్‌‌పూర్ సహారన్‌‌పూర్ 34,64,228 3,689 939
65 SM సంభల్ సంభల్ 22,17,020 2453 890
66 SK సంత్ కబీర్ నగర్ ఖలీలాబాద్ 17,14,300 1,442 1,014
67 SJ షాజహాన్‌పూర్ షాజహాన్‌పూర్ 30,02,376 4,575 673
68 SH షామ్లీ [2] షామ్లీ 12,74,815 1,063 1,200
69 SV శ్రావస్తి భింగా 11,14,615 1,948 572
70 SN సిద్దార్థనగర్ సిద్ధార్థనగర్ 25,53,526 2,751 882
71 SI సీతాపూర్ సీతాపూర్ 44,74,446 5,743 779
72 SO సోన్‌భద్ర రాబర్ట్స్‌‌గంజ్ 18,62,612 6,788 274
73 SU సుల్తాన్‌పూర్ సుల్తాన్‌పూర్ 37,90,922 4,436 855
74 UN ఉన్నావ్ ఉన్నావ్ 31,10,595 4,561 682
75 VA వారణాసి వారణాసి 36,82,194 1,535 2,399

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. 1 March 2011. Archived from the original on 26 ఏప్రిల్ 2012. Retrieved 31 July 2012.
  2. Shamli district of Uttar Pradesh was formerly named Prabudh Nagar district, which did not exist during census 2011.

విద్యా వ్యవస్థసవరించు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు.

అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి.

పర్యాటక ప్రాంతాలుసవరించు

తాజ్ మహల్ ( "తాజ్") మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది.ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.[1][2] 1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది."

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Hasan, Parween (November 1994), "Review of Mughal Architecture: Its outline and its history", The Journal of Asian Studies, 53 (4): 1301
  2. లెస్లీ A. డ్యుటెంపుల్, "ది తాజ్ మహల్", లెర్నర్ పబ్లిషింగ్ గ్రూప్ (మార్చ్ 2003). pg 26: "ది తాజ్ మహల్, ఎ స్పెక్టాక్యులర్ ఎగ్జాంల్ అఫ్ మొఘుల్ నిర్మాణశాస్త్రం, బ్లెండ్స్ ఇస్లామిక్, హిందూ అండ్ పర్షియన్ స్టైల్స్"

బయటి లింకులుసవరించు