కృష్ణ మండలం (నారాయణపేట జిల్లా)

(కృష్ణ (మాగనూరు మండలము) నుండి దారిమార్పు చెందింది)

కృష్ణ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

ఇది 16.41° ఉత్తర అక్షాంశం, 77.33° తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. కృష్ణానది తీరంలో ఉన్న ఈ గ్రామం చారిత్రక ప్రాశస్త్యం కలది. గ్రామంలో పురాతన దేవాలయాలు, అధ్యాత్మిక నిలయాలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే వాడి - గుంతకల్లు సెక్షన్‌లో 'కృష్ణ రైల్వేస్టేషన్' ఉంది.

నూతన మండల కేంద్రంగా గుర్తింపుసవరించు

లోగడ కృష్ణ (హిందూపూర్) గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట రెవెన్యూ డివిజను పరిధిలోని మాగనూరు మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా కృష్ణ (హిందూపూర్) గ్రామాన్ని (0+12) పన్నెండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా మహబూబ్ నగర్ జిల్లా,నారాయణపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పుసవరించు

గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[3]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. కష్ణ (హిందూపూర్)
 2. తంగడి
 3. శుకుర్లింగంపల్లి
 4. కుసుమర్తి
 5. చేగుంట
 6. ఐనాపూర్
 7. కున్సి
 8. గుడెబెల్లూరు
 9. ముడుమాల్
 10. మురహరిదొడ్డి
 11. గురుజాల
 12. అలంపల్లి
 13. ముడ్ మాల్ దొడ్డి
 14. కళ్లహళ్లి

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
 3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలుసవరించు