కెంపే గౌడ

(కెంపెగౌడ నుండి దారిమార్పు చెందింది)

కెంపే గౌడ బెంగళూరు నగర నిర్మాత. ఇతను శ్రీ కృష్ణదేవ రాయలు సామంతు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ఇతని పేరు మీదనే నేటికీ బెంగుళూరు బస్సు స్టేషను కెంపె గౌడ బస్సు నిలయము అని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు.

కెంపే గౌడ I
Chieftain of Yalahanka Nadu (a principality under Vijayanagara Empire)
జననం
హిరియ కెంపే గౌడ

27 జూన్ 1510 AD
బెంగళూరు
మరణం1569 AD
ఇతర పేర్లుబెంగళూరు కెంపే గౌడ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బెంగళూరు నగర నిర్మాత
అంతకు ముందు వారుకెంపే నంజె గౌడ
తరువాతివారుగిడ్డే గౌడ

నేపధ్యము

మార్చు

1533-1569 లో విజయనగర రాజ్య సామంత రాజు కెంపే గౌడ.

వృషభ ఆలయం

మార్చు

దొడ్డ బసవన గుడిగా పిలవబడే వృషభ ఆలయం దక్షిణ బెంగళూరు – బసవనగుడి లోని ఎన్ ఆర్ కాలనీలో ఉంది. నందీశ్వరుడు ఇక్కడి ప్రధాన దైవం. హిందూ పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుడికి వాహనమే కాక పరమ భక్తుడు. నందీశ్వరుడి ఆలయాల్లోకల్లా అతి పెద్దదైన ఈ ఆలయాన్ని 1537 లో విజయనగర రాజ్య సామంత రాజు కెంపే గౌడ నిర్మించాడు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవూ వుండే ఇక్కడి నందీశ్వరుని విగ్రహాన్ని గ్రానైట్ ఒంటి రాతిలోంచి మలిచారు.ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు – విశ్వభారతి నది ఈ విగ్రహం పాదాల నుంచే పుట్టిందని చెప్తారు. క్షేత్ర చరిత్ర ప్రకారం ఇప్పుడు గుడి వున్న ప్రదేశం దాకా వున్న వేరుసెనగ చేలన్నీ తినేస్తూ వచ్చిన ఓ పెద్ద వృషభాన్నిశాంతింప చేసేందుకు ఈ గుడి కట్టారు. ఈ గాథకు స్మారకంగా ఇప్పటికి నవంబరు డిసెంబరు నెలల్లో గుడి దగ్గ కడలేకయి పరిషే (వేరుసెనగ పండుగ) నిర్వహిస్తారు – వేరుసెనగ పంట అప్పుడే చేతికి వస్తుంది కనుక. ఈ గుడిని దర్శించాలంటే ఇదే మంచి సమయం.వృషభ ఆలయం సమీపంలోనే దొడ్డ గణేష్ దేవాలయం ఉంది. బసవనగుడి కనుక్కోవడం యాత్రికులకు కష్టమేమి కాదు. బెంగళూరు నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలానే వున్నాయి.[1]

ఉల్సూర్ చెరువు

మార్చు

నగరానికి ఈశాన్యంలో ఎం జీ రోడ్డుకి దగ్గరలో ఉల్సూర్ చెరువు ఉంది. బెంగళూరును స్థాపించిన కెంపే గౌడ దీన్ని నిర్మించాడు.[2] సుమారు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో వుండే ఈ చెరువులో అక్కడక్కడా దీవులు వుంటాయి. శ్రావణ భాద్రపదాల్లో ఇక్కడ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. ఈత కోసం ఈత కొలను లాంటి అనేక వినోద కార్యక్రమాలకు ఒక ప్రత్యెక కాంప్లెక్స్ ఉంది. ఉల్సూర్ చెరువుకి దగ్గరలో వున్న గురుద్వారా బెంగళూరు నగరం లోనే అతి పెద్దది.ఈ చెరువులో బోటు షికారు బాగా ప్రసిద్ధి. ఇక్కడి బోటు క్లబ్బు చెరువులో తిరగడానికి, మధ్యలో వున్న దీవుల్లో ఆగడానికి బోట్లు సిద్ధంగా వుంచుతుంది. మూడు కాల్వల ద్వారా నీరు చేరే ఈ చెరువు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. చెరువు పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు చేశారు, పటిష్ఠమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఉల్సూర్ చెరువు నుంచి ఎం జీ రోడ్డు నడక దూరంలోనే ఉంది. హలసూరుకి దగ్గరలో మెట్రో రైల్ కట్టే ప్రతిపాదన ఉంది.

హెబ్బల్ సరస్సు

మార్చు

బెంగళూరులో జాతీయ రహదారి - 7 మార్గంలో, బళ్లారి ఔటర్ రింగ్ రోడ్ (ORR) కూడలిలో హెబ్బాల్ సరస్సు ఉంది. 1537 లో కెంపె గౌడ సృష్టించిన మూడు సరస్సులలో ఇది ఒకటి.

మూలాలు

మార్చు
  1. "వృషభ ఆలయం, Bangalore". telugu.nativeplanet.com.
  2. "అల్సూర్ చెరువు, Bangalore". telugu.nativeplanet.com.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కెంపే_గౌడ&oldid=4100004" నుండి వెలికితీశారు