కెప్లర్ గ్రహ గమన నియమాలు
భూ కేంద్రక సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతముల ఆమోద యోగ్యతల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల పర్యవసానంగా ఖగోళ శాస్త్ర పరిశీలనలు అన్ని కచ్చితంగా లెక్కించాల్సి వచ్చింది. ఆ పరిశీలనల ఫలితాలను బట్టి టైకోబ్రాహి అను ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైనదని వివరించాడు. దూర దర్శినులు లాంటి ఆధునిక పరికరాలేమీ లేని ఆ కాలంలో ఈయన ఖచ్చితమయిన వివరాలు కనుగొన్నాడు. టైకోబ్రాహీ పరిశోధనల ఫలితాలను అతని శిష్యుడైనటువంటి జోహాన్స్ కెప్లర్ సా.శ. 1619 వ సంవత్సరంలో సూర్య కేంద్రక సిద్ధాంతానికీ కచ్చితంగా సరిపోయే విధంగా గ్రహాల చలనాలకు సంబంధించిన కొన్ని భావనలు చేశాడు. ఆ భావనలే కెప్లర్ గ్రహ గమన నియమాలు (Kepler's laws of planetary motion) గా ఈనాటికీ అనువర్తిస్తున్నాయి.
ఖగోళ శాస్త్రములో కెప్లర్ మూడు గ్రహ గమన నియమములను ప్రతిపాదించడం జరిగింది. కెప్లర్ నియమము ప్రకారం గ్రహములు సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలలో తిరుగు తుంటాయి.
గ్రహ గమన నియమాలు
మార్చు- ప్రతి గ్రహము దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీర్ఘ వృత్తం యొక్క రెండు నాభులలో ఏదో ఒక స్థానములో సూర్యుడు ఉంటాడు.
- దీర్ఘవృత్తాకార మార్గంలో తిరిగే గ్రహమునకు సూర్యునికి కలిపే రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యములను యేర్పరుస్తుంది..[1]
- గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గం దీర్ఘవృత్తం యొక్క దీర్ఘాక్షం యొక్క ఘనమునకు అనులోమాను పాతంలో ఉండును.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Bryant, Jeff; Pavlyk, Oleksandr. "Kepler's Second Law", Wolfram Demonstrations Project. Retrieved December 27, 2009.