కులక్కత్తిల్ గీవర్గీస్ జార్జ్ (24 మే 1946 - 24 సెప్టెంబర్ 2023) భారతీయ సినిమా దర్శకుడు. సినిమా దర్శకుడు రచయిత. అతను 1980లో ఇతను నటనపై అవగాహన కల్పించడానికి పాఠశాలను స్థాపించాడు. మలయాళ సినిమా రంగానికి చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన JC డేనియల్ అవార్డును అందుకున్నారు. [1]

కె.జి. జార్జ్
జననం1946 మే 24
తిరువనంతపురం కేరళ భారతదేశం
మరణం2023 సెప్టెంబర్ 24
ఎర్నాకుళం కేరళ భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1975 నుంచి 2023 వరకు
భార్య / భర్తసల్మా
పిల్లలు2

జార్జ్ స్వప్నదానం (1975)తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు, ఇది మలయాళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఉల్కడల్ (1979), మేళా (1980), యవనిక (1982), లేఖయుడే మరణం ఒరు ఫ్లాష్‌బ్యాక్ (1983), ఆడమింటే వారియెల్లు (1983), పంచవడి పాలెం (1984), ఇరకల్ (1986), మట్టోరల్ (1988) ) సినిమాలకు దర్శకత్వం వహించాడు. 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు. [2] [3]

కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. [4]

బాల్యం

మార్చు

జార్జ్ శామ్యూల్ అన్నమ్మ దంపతులకు 1946 మే 24న తిరువల్లలో జన్మించాడు. [5] [2] పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) నుండి డిప్లొమా పొందిన తరువాత, కెజి జార్జ్ దర్శకుడు రాము కరియాత్‌కి అసిస్టెంట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అతను స్వప్నదానం (1975)తో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు.

సిని జీవితం

మార్చు

అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్వప్నదానం భారీ విజయాన్ని నమోదు చేసింది. స్వప్న దానం సినిమా చిన్న సినిమా, అయినప్పటికీ సాధారణ జనాలను చేరుకోవడంలో విజయం సాధించింది. తరువాత అతను కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. స్వప్నదానం ఉత్తమ చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 1980లో విడుదలైన, కొలంగల్ సినిమా పరాజయం పాలైంది. ఇతను చివరిగా 2018 లో విడుదలైన ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వ వహించాడు.

జార్జ్ 77 సంవత్సరాల వయస్సులో సెప్టెంబర్ 24న మరణించారు. అతను బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్నాడు. [2] [6] తీవ్రమైన స్ట్రోక్‌తో బాధపడుతున్న అతను నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  1. "Filmmaker K G George to be Honoured With J C Daniel Award". No. 06 September 2016. NDTV. Retrieved 24 September 2023.
  2. 2.0 2.1 2.2 "Malayalam film director KG George dies at 77". Indian Express. 24 September 2023. Retrieved 24 September 2023.
  3. "Influential Malayalam filmmaker K G George, who expertly bridged the gap between art house and mainstream cinema, dies at 77". Indian Express.
  4. "K.G. George war with Lal and Mamooty | Cinefundas.com - One Stop Cinema Portal". Archived from the original on 20 May 2009. Retrieved 2009-03-18.
  5. "Master of the middle path". Onmanorama. 24 May 2015. Retrieved 2023-09-24.
  6. "സംവിധായകന്‍ കെ ജി ജോര്‍ജ് അന്തരിച്ചു". Samayam. 24 September 2023. Retrieved 24 September 2023.