రాము కారియత్
మలయాళ సినిమా దర్శకుడు.
రాము కారియత్, (1 ఫిబ్రవరి 1927 - 10 ఫిబ్రవరి 1979) మలయాళ సినిమా దర్శకుడు. 1950 నుండి 1980 వరకు దాదాపు మూడు దశాబ్దాలుగా మలయాళ సినిమారంగంలో దర్శకుడిగా వెలగొందుతూ నీలక్కుయిల్ (1954), మిన్నమినింగు (1957), ముడియనయ పుత్రన్ (1961), మూడూపదం (1963), చెమ్మీన్ (1965) వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. చెమ్మీన్ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ సినిమా అవార్డును అందుకుంది. దక్షిణ భారతదేశం నుండి ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైన తొలి సినిమా ఇది.[1]
రాము కారియత్ | |
---|---|
జననం | ఎంగండియూర్, త్రిస్సూరు జిల్లా, కేరళ, భారతదేశం | 1927 ఫిబ్రవరి 1
మరణం | 1979 ఫిబ్రవరి 10 త్రివేండ్రం, కేరళ, భారతదేశం | (వయసు 52)
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1954–1979 |
గుర్తించదగిన సేవలు | చెమ్మీన్, నీలక్కుయిల్ |
బంధువులు | దేవన్ |
జననం
మార్చుఇతడు 1927, ఫిబ్రవరి 1న కేరళ రాష్ట్రం, త్రిస్సూరు జిల్లాలోని ఎంగండియూర్ గ్రామంలో జన్మించాడు.
అవార్డులు
మార్చు- 1954: ఉత్తమ చిత్రంగా ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ - నీలక్కుయిల్ [2]
- 1954: మలయాళంలో ఉత్తమ చిత్రంగా ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ - నీలక్కుయిల్
- 1961: మలయాళంలో ఉత్తమ చిత్రంగా ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ - ముదయనాయ పుత్రన్[3]
- 1965: జాతీయ ఉత్తమ చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం - చెమ్మీన్
సినిమాలు
మార్చు- నీలక్కుయిల్ (1954)
- భరత నాట్యం (1956)
- మిన్నం మినుంగు (1957)
- ముదయనాయ పుత్రన్ (1961)
- మూడూపదం (1963)
- చెమ్మీన్ (1965)
- ఈజు రాత్రికల్ (1968)
- అభయం (1970)
- మాయ (1972)
- నెల్లు (1974)
- డ్వీపు (1976)
- కొండగలి (1978)
- అమ్మూవిన్టే అట్టింకుట్టి (1978)
- మలంకట్టు (1980)
మరణం
మార్చు1979, ఫిబ్రవరి 10న త్రివేండ్రంలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ అరందై, నారాయణన్ (1 March 1971). "మలయాళ చిత్రకథలు - ఒక పరిశీలన". విజయచిత్ర. 5 (9): 18.
- ↑ "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 26 June 2021.
- ↑ "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 December 2016. Retrieved 26 June 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాము కారియత్ పేజీ