కె.ఎన్.గోవిందాచార్య

భారతీయ రాజకీయవేత్త

కోడిపాకం నీలమేఘేంద్ర గోవిందాచార్య (జ. 1943 మే 2) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్, పర్యావరణ ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ ఉద్యమకారుడు, ఆలోచనాపరుడు. అతడు భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి బలమైన విమర్శకుడు. అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కూడా విమర్శకుడు.[1]

కె.ఎన్.గోవిందాచార్య
కె.ఎన్.గోవిందాచార్య

కె.ఎన్.గోవిందాచార్య


వ్యక్తిగత వివరాలు

జననం (1943-05-02) 1943 మే 2 (వయసు 80)
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ/రాష్ట్రీయ స్వాభిమాన్ అందోళన్ (పూర్వం)
జీవిత భాగస్వామి లేరు
పూర్వ విద్యార్థి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి సామాజిక , రాజకీయ ఉద్యమకారుడు

రాజకీయ జీవితం మార్చు

కె.ఎన్.గోవిందాచార్య 1988 లో భారతీయ జనతా పార్టీ సభ్యునిగా చేరాడు. 2000 వరకు తన జనరల్ సెక్రటరీగా పనిచేశారు.[ఆధారం చూపాలి] ప్రధానమంత్రి వాజ్‌పేయి పట్టుబట్టడంపై బిజెపిను విడిచిపెట్టాడు. ప్రధానమంత్రి కేవలం ముసుగు కాగా అద్వానీ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నందువల్ల బి.జె.పిను విడిచి పెట్టవలసివచ్చింది.[2] ఈ ప్రకటన ఆయనపై తప్పుగా ఆరోపించబడింది అని చెప్పారు[3] కానీ వాజ్‌పేయిని ఆయన ప్రకటనతో సమర్థించుకోలేకపోయాడు. ఆ వ్యాఖ్య ప్రామాణికమైనదో లేదో తెలియదు కానీ పార్టీ గౌరవానికి నష్టం జరిగింది, [4]

విశ్రాంత సెలవు , తరువాత మార్చు

భారతదేశ రాజకీయ, కార్పొరేట్ రంగాలలో అవినీతి పెరుగుతున్న సంఘటనలు, 2011 జూన్ 5 న రామ్‌దేవ్ అనుచరులపై పోలీసుల అణిచివేత[5] వల్ల పూర్వపు జర్నలిస్టులు, విద్యార్థి ఉద్యమకారులు, బాలల హక్కుల ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు ఆయనను దేశంలో గల 50 చిన్న, పెద్ద రాజకీయ సంస్థలతో కలిపి ఒక కూటమిని ప్రారంభించవలసినదిగా జూన్ 25న ప్రోత్సహించాయి. ఆ రోజు పూర్వం అత్యవసర పరిస్థితి ప్రకటించిన దినాన్ని గుర్తు చేసింది. అతడు కొత్త కూటమి అయిన సేవ్ డెమోక్రసీ ఫ్రంట్ కు చైర్మన్ గా ఎన్నికయ్యాడు.

గోవింద్రచార్యకు మద్దతుగా, "భారత్ వికాస్ సంఘం" యొక్క మూడవ జాతీయ సమావేశం 2010 డిసెంబరు 23 నుండి 2011 జనవరి 1 వరకు కర్ణాటకలోని కల్బర్గి (గుల్బర్గా) లో జరిగింది.[6]

మూలాలు మార్చు

  1. "Govindacharya Criticises Cong, BJP Over Corruption". news.outlookindia.com. Archived from the original on 2013-09-22. Retrieved 2012-12-25.
  2. Mohua Chatterjee (9 June 2012). "Narendra Modi's bete noire, Sanjay Joshi stripped of party role - Times Of India". Timesofindia.indiatimes.com. Retrieved 2012-12-25.
  3. "I never called Vajpayee mask of govt: Govindacharya". rediff.com. 23 January 2002. Retrieved 2012-12-25.
  4. http://archives.digitaltoday.in/indiatoday/20010115/swapan.html
  5. "Midnight police swoop on Baba Ramdev ends protest". The Times Of. Times News Network. 5 June 2011. Archived from the original on 2012-12-31. Retrieved 2012-12-25.
  6. Special Correspondent (28 December 2010). "NATIONAL / KARNATAKA : Rural economy needs to be stronger: Karandlaje". The Hindu. Retrieved 2012-12-25.