కె.ఎస్.రత్నం తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో చేవెళ్ళ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

కె.సాయన్న రత్నం
కె.ఎస్.రత్నం


ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
కేతిరెడ్డి పల్లి, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
రాజకీయ పార్టీ భా.జా.పా
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కె.సాయన్న
జీవిత భాగస్వామి ఈమేలియా
నివాసం హైదరాబాద్

రాజకీయ జీవితం మార్చు

కె.ఎస్.రత్నం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరపున 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చేవెళ్ళ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య పై 2249 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3] ఆయన 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య చేతిలో 781 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.

కె.ఎస్.రత్నం అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాలే యాదయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. దీంతో 2018 ఎన్నికల్లో టికెట్‌ దక్కకపోవడంతో 2018 సెప్టెంబరు 13న టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి[4] సెప్టెంబరు 27న కాంగ్రెస్ పార్టీలో చేరి[5] కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలే యాదయ్య చేతిలో ఓడిపోయాడు.[6] ఎన్నికల అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరాడు

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు దక్కకపోవడంతో, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు టికెట్ కేటాయించడంతో ఆయన అక్టోబర్ 26న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[7][8]

మూలాలు మార్చు

  1. CEO Andhra Pradesh (2009). "KS Ratnam Affidavit" (PDF). Archived from the original (PDF) on 17 April 2022. Retrieved 17 April 2022.
  2. Sakshi (18 May 2014). "టీఆర్‌ఎస్ కొంపముంచిన 'రెబల్'". Sakshi. Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  3. Sakshi (28 February 2014). "తెలంగాణలో భూముల ధరలు పడిపోవు: కేసీఆర్". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  4. The Hans India (13 September 2018). "KS Ratnam quits TRS" (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  5. Deccan Chronicle (26 September 2018). "Former TRS MLA K S Ratnam to join Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  6. Sakshi (3 August 2023). "చేవెళ్ల (SC) నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  7. NTV Telugu (26 October 2023). "బీఆర్ఎస్ కు భారీ షాక్.. రేపు బీజేపీలో చేరనున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  8. Sakshi (27 October 2023). "బీఆర్‌ఎస్‌కు కూచుకుళ్ల, కేఎస్‌ రత్నం రాజీనామా". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.