కె.ఓమనకుట్టి
కమలాక్షి ఓమనకుట్టి ఒక విద్యావేత్త, సంగీత గురువు, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు.[1] ఈమె సంగీత విషయాలపై పరిశోధనా పత్రాలు సమర్పించింది. ఈమె కథాకళి సంగీతంపై పరిశోధించి డాక్టరేట్‌ను సంపాదించింది.
కె.ఓమనకుట్టి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | కమలాక్షి ఓమనకుట్టి |
మూలం | హరిపద్, అలెప్పి జిల్లా, కేరళ రాష్ట్రం,భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక గాత్ర సంగీతం |
వృత్తి | ప్రొఫెసర్, గాయని |
జీవిత విశేషాలుసవరించు
ఈమె కేరళ రాష్ట్ర్రం అలెప్పి జిల్లా హరిపద్ గ్రామంలో 1943లో జన్మించింది. ఈమె తండ్రి మలబార్ గోపాలన్ నాయిర్ హార్మోనియం వాద్యకారుడు. తల్లి కమలాక్షియమ్మ కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె ఇద్దరు సోదరులు కూడా సంగీత విద్వాంసులే. ఇతని అన్న ఎం.జి.రాధాకృష్ణన్ మలయాళ సినిమాలలో సంగీత దర్శకుడిగా ఉన్నాడు. తమ్ముడు ఎం.జి.శ్రీకుమార్ సినిమా నేపథ్యగాయకుడు.[2]
విద్యాభ్యాసం, ఉద్యోగంసవరించు
ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలో గడిచింది. 1963లో కేరళ విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో బి.ఎస్.సి., పట్టాను పొందింది.[3] సంగీతం పట్ల అభిరుచితో ఈమె తిరువనంతపురంలోని సంగీత అకాడమీలో చదివి "గానప్రవీణ" పట్టాను సంపాదించింది. తరువాత ఈమె తిరువనంతపురం మహారాజా మహిళా కళాశాలలో సంగీత విభాగంలో అధ్యాపకురాలిగా చేరింది. ఉద్యోగం చేసుకుంటూనే ఈమె సంగీతంలో బి.ఎ.డిగ్రీని పార్ట్‌టైమ్‌లో చదివింది. బి.ఎ.లో విజయం సాధించిన తర్వాత ఈమె అదే కళాశాలలో అదే విభాగంలో సెకెండ్ గ్రేడ్ ప్రొఫెసర్‌గా పదోన్నతిని పొందింది. ఈ హోదాలో ఈమె 6 సంవత్సరాలు విద్యార్థులకు సంగీతం నేర్పింది. [4] తరువాత మొదటి గ్రేడు ప్రొఫెసర్‌గా అదే సంగీత విభాగంలో పనిచేసింది. కేరళ విశ్వవిద్యాలయంలో సంగీతశాఖలో మొట్టమొదటి ప్రొఫెసర్‌గా పనిచేసిన ఘనత ఈమెకే దక్కింది. ఈమె అదే శాఖలో సంగీతంలో స్నాతకోత్తర పట్టాను, "కథాకళి సంగీతం పుట్టుక పరిణామక్రమం" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి.పట్టాను సాధించింది.[4] ఈమె లెక్చరర్‌నుండి ప్రొఫెసర్ దాకా 37 సంవత్సరాలు బాధ్యతలను నిర్వర్తించి 2003లో కేరళ విశ్వవిద్యాలయపు సంగీత విభాగానికి అధిపతిగా పదవీ విరమణ చేసింది. ఈమె సంగీత భారతి అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నది.[5] ప్రస్తుతం ఈమె పంకజ కస్తూరి ఆయుర్వేద కళాశాల మ్యూజిక్ థెరపీ విభాగంలో సీనియర్ ఫ్యాకల్టీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నది.[6]
సంగీత ప్రస్థానంసవరించు
ఈమె మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తూనే దేశంలోని అనేక ప్రాంతాలలో జరిగిన సంగీత కచేరీలలో పాల్గొనింది. ఈమె 300కు పైగా కచేరీలను నిర్వహించింది. ఈమె ప్రత్యేకించి స్వాతి తిరునాళ్ కృతులను విశ్వవ్యాప్త ప్రచారం కల్పించింది. త్యాగరాజ పంచరత్న కృతుల మాదిరిగానే ఈమె 2015లో తిరువనంతపురంలో 500 మంది సంగీత విద్యార్థులతో స్వాతి తిరునాళ్ పంచరత్నకృతులను "స్వాతి పంచరత్నం" పేరుతో ఆలపింపజేసింది. కేరళ ప్రభుత్వం సహకారంతో వృద్ధాశ్రమాలలో సంగీతం ద్వారా రోగాలను నయం చేయడానికి (మ్యూజికల్ థెరపీ) కృషి చేస్తున్నది. ఈమె వద్ద సంగీతం నేర్చుకున్న అనేక మంది కళాకారులలో కె.ఎస్.చిత్ర, బి.అరుంధతి, కె.ఎస్.హరిశంకర్, మంజరి, కె.ఎస్.రేష్మీ మొదలైనవారున్నారు. [7] [8][9]
అవార్డులుసవరించు
ఈమె పొందిన అనేక పురస్కారాలలో కొన్ని:
- 1997 – కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు (శాస్త్రీయ సంగీతం)[10]
- 2012 – కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (శాస్త్రీయ సంగీతం)[10]
- 2013 – సుబ్బులక్ష్మి అవార్డు[4]
- 2020 – స్వాతి సంగీత పురస్కారం[11]
- 2016 - కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు (కర్ణాటక సంగీతం - గాత్రం)
మూలాలుసవరించు
- ↑ "A life in music". The HIndu. May 3, 2012. Retrieved 22 October 2013.
- ↑ "Dr K.Omanakutty teacher Amma". kalakeralam.com. Retrieved 22 October 2013.
- ↑ "Dr K Omanakutty". Archived from the original on 2017-09-26. Retrieved 2021-03-01.
- ↑ 4.0 4.1 4.2 "K. Omanakkutty wins M.S. Subbulakshmi Award". Kerala Kaumudi. May 3, 2013. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 22 October 2013.
- ↑ "A life in music". www.thehindu.com. The Hindu. Retrieved 13 February 2020.
- ↑ "Dr. Omanakutty meets students of Asian studies and South Indian cultures and languages courses". liberalarts.utexas.edu. Retrieved 13 February 2020.
- ↑ "Dr K Omanakutty".
- ↑ Nagarajan, Saraswathy (3 May 2012). "A life in music". The Hindu – via www.thehindu.com.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-26. Retrieved 2021-03-01.
- ↑ 10.0 10.1 "KSNA Fellowship & Awards". KSNA. Retrieved 2020-11-12.
- ↑ "Swathi music award for K. Omanakutty". The Hindu. 19 February 2021. Archived from the original on 19 February 2021.