ఏ మాయ చేసావే (ధారావాహిక)

ధారావాహిక

ఏ మాయ చేసావె (ఆంగ్లం: వాట్‌ మ్యాజిక్‌ హ్యావ్ యు డన్‌?) అనేది స్టార్ మాలో ప్రసారమైన ఒక భారతీయ ధారావాహిక. ఇది బియాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్ నిర్మించిన ప్రేమ యొక్క శక్తివంతమైన కథ. ఇది హిందీలో "జానా నా దిల్ సే దూర్"గా ప్రసారమయ్యింది. దీనిలో శివానీ సుర్వే, విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించగా వినీత్ కుమార్, శిల్పా తులాశ్కర్ మిగతా ప్రధాన పాత్రల్లో నటించారు.

ఏ మాయ చేసావే
Ye maaya chesave serial
జానర్శృంగారం
సృష్టికర్తప్రతీక్ శర్మ (స్టార్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్)
రచయితమింరల్ ఝా, శిల్ప ఎఫ్. డిమెల్లో
దర్శకత్వంరహిబ్ సిద్దిక్వి, జాగృత్ మెహతా
తారాగణంశివాని సుర్వే, విక్రమ్ సింగ్ చౌహన్
దేశం భారతదేశము
అసలు భాషతెలుగు [1]
సీజన్ల సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య౧౬౬
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్యశ్ ఎ పాట్నాయక్, మమతా యశ్ పాట్నాయక్
ప్రొడక్షన్ స్థానాలుఅజ్మీర్, జైపూర్, ఢిల్లీ
కెమేరా సెట్‌అప్బహు కెమెరాలు
నిడివి౧౯ - ౨౦ నిమిషాలు
ప్రొడక్షన్ కంపెనీలుబియాండ్ ఫిల్మ్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఇన్స్పైర్ ఫిల్మ్స్ ప్రయివేట్ లిమిటెడ్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్స్టార్ మా
వాస్తవ విడుదల౮ ఆగస్టు ౨౦౧౬ –
౩౧ మార్చి ౨౦౧౭
బాహ్య లంకెలు
హాట్ స్టార్

వివరణ

మార్చు

అజిత్, వివిధ ధ్రువాలు వేరుగా ఉన్నప్పటికీ నిజమైన ప్రేమ ద్వారా అనుసంధానించబడి ఉన్నారు. అజిత్ తన అమ్మ సుజాతతో కలిసి హైదరాబాద్లో భవనంలో నివసిస్తున్నాడు. అతను అన్ని మంచి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తి, తన కలలను సాధించడానికి కృషి చేస్తాడు. అతను తన తల్లిని ప్రేమిస్తాడు, అతను తనను తాను అజిత్ సుజాత అని పేరు పెట్టుకున్నాడు. వివిధ కూడా అదే పట్టణంలో నివసిస్తుంది. ఆమె పట్టణంలో ధనవంతుడైన వ్యాపారవేత్త అయిన కైలాశ్ కశ్యప్ పెద్ద కుమార్తె. ఆమె తన తండ్రి తోలుబొమ్మలా ప్రవర్తిస్తుంది. ఆమె తండ్రి చెప్పినదానిని మాత్రమే నమ్ముతుంది.

కథా విస్తరణ

మార్చు

అజిత్ తన చదువు పూర్తి చేసి దిల్లీ నుండి తన పట్టణానికి తిరిగి వస్తాడు. తన తండ్రి జాగరణ వేడుకను ఏర్పాటు చేయడంతో ప్రసాదం తయారు చేయడానికి పాలు తీసుకురావడానికి వివిధ సుజాత యొక్క ఇంటికి వెళ్తుం. అజిత్, వివిధా ఒకరినొకరు కలుస్తారు. గర్భిణీ ఆవుకు అజిత్ ప్రసవం చేయడంతో వివిధా మూర్ఛపోతుంది. వివిధ తన పట్టీని దూడకు కట్టి దానికి పవిత్ర అని పేరు పెట్టింది. పాలు ఇవ్వడానికి అజిత్ తిరస్కరించాడు, వివిధ కోపంతో తిరిగి వెళ్తుంది. అజిత్, సుజాత మాటల ద్వారా జాగరణ వేడుకకు వెళ్ళి పాలు ఇస్తాడు. పాలు కోసం డబ్బు తీసుకోవటానికి నిరాకరించడంతో వివిధ అతన్ని తిడుతుంది. మరుసటి రోజు, వివిధా అజిత్‌తో తండ్రి ప్రతిష్ఠ గురించి తనకు ఏమీ తెలియదని అంటుంది. వివిధా మాటలకు సుజాత, అజిత్ లకు కోపం వస్తుంది . వివిధా చెల్లెలు చిన్నూ తన స్నేహితురాలితో కలిసి క్లాసులు బంక్ చేసి బడి నుండి బయటకు వెళ్తుంది. కొందరు కుర్రాళ్ళు వారిని ఆటపట్టిస్తారు. అజిత్ అబ్బాయిలతో పోరాడి చిన్నును రక్షిస్తాడు.

కైలాష్ సుజాత, ఆమె ఆవుల పాలతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాడు, దానిని వివిధ యొక్క తమ్ముడు అంకిత్ ద్వారా సుజాతకు ఒక లేఖ రూపంలో పంపుతాడు, కాని వివిధా దానిని తీసుకువెళ్తుంది. ఇలాంటి ఒప్పందాలను అంగీకరించడం సురక్షితం కాదని అజిత్ సుజాతకు చెప్తాడు. వివిధ పవిత్రతో ఆడుకుంటుంది, ఎండుద్రాక్షను పెడుతుంది. ఆమె ఆవు పేడను తొక్కడంతో ఆమె కింద పడుతుండగా అజిత్ కాపాడుతాడు. వివిధ అజిత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. పవిత్రకు కట్టిన ఆమె పట్టీ పోయిందని ఆమె చెప్తుంది. అజిత్కు అది తనకు ఇష్టమైన పట్టి అని ఆమె మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది, దీనికి ఇరువది అయిదు వేల రూపాయలు/- ఖర్చవుతుందని చెప్తుంది. అజిత్ రోజంతా పట్టీ కోసం వెతుకుతూనే ఉంటాడు కాని అది వివిధతో ఉంటుంది. అతను సరస్సు వద్దకు వెళ్లి దాని కోసం వెతుకుతూ ఉంటాడు. వివిధ ఆమె చేసిన తప్పును గుర్తించి క్షమించమని చెప్పడానికి తన ఇంటికి వెళ్తుంది. కానీ అజిత్ తన బైక్‌ను తక్కువ ధరకు అమ్మేసి డబ్బు తెచ్చి వివిధ చేతిలో పెడతాడు. ఆమె నిజం చెబుతుంది, అజిత్ ఆమెపై కోపం తెచ్చుకుంటాడు. అతను తిరిగి మెకానిక్ దుకాణానికి పరిగెత్తుతాడు. కానీ చాలా ఆలస్యం అవుతుంది. మెకానిక్ షట్టర్ మూసివేసాడు. మరుసటి రోజు అతను ౪౦౦౦౦/- ఇస్తేనే తన బైక్‌ను తిరిగి ఇస్తానని చెప్తాడు. వివిధ మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకుంటుంది. మెకానిక్ బండిను తిరిగి తెస్తాడు. అజిత్, సుజాత సంతోషంగా ఉన్నారని చూసిన వివిధ సంతోషంగా ఉంది.

గోపుజ సందర్భంగా, కైలాశ్ సుజాతను, ఆమె ఆవూ దూడలను తన ఇంటికి ఆహ్వానించి ఆమెను తీవ్రంగా అవమానిస్తాడు. సుజాత ఆవు, దూడలను ఇంటికి తిరిగి తీసుకువస్తానని వివిధ సుజాతకు వాగ్దానం చేసింది. కానీ, దారిలో కొందరు దొంగలు ఆవుకు విషమిచ్చి దాని దూడను దొంగిలించారు. మరుసటి రోజు, వివిధా ఒక వీడియోను చూపిస్తుంది, దీనిలో దూడను దొంగిలించడం రికార్డ్ చేయబడింది. సుజాత సహాయంతో అజిత్ పుష్కర్ వెళ్లి దూడ కోసం వెతకాలని నిర్ణయించుకుంటాడు. వివిధ, అపరాధభావం కారణంగా పుష్కర్ కు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. పవిత్రను వెతుక్కుంటూ అజిత్, వివిధ పుష్కర్‌కు బయలుదేరుతారు. అదే సమయంలో కైలాష్‌ను ముఖ్య అతిథిగా పుష్కర్‌కు ఆహ్వానించారు. ఉమా (వివిధ తల్లి), చిన్నూ ఆందోళన చెంది సుజాత ఇంటికి వెళ్తారు. పుష్కర్లో, దొంగలు వివిధను కిడ్నాప్ చేసి, ఆమెను అమ్మాలని నిర్ణయించుకుంటారు. అజిత్ వివిధను దొంగల నుండి రక్షిస్తాడు. పోలీసులు దొంగలను అరెస్టు చేస్తారు. అజిత్, వివిధ ఇంటికి తిరిగి వస్తారు, కాని కైలాశ్ కూడా అదే సమయంలో తిరిగి వస్తాడు. కైలాశ్ కు కోపం వచ్చి వివిధను తిడతాడు కాని అజిత్ ఆమెను రక్షిస్తాడు. తన కొడుకును తన కుమార్తెకు దూరంగా ఉంచాలని కైలాశ్ సుజాతను హెచ్చరిస్తాడు. సుజాత గాయపడగా, వివిధ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి సహాయం చేస్తుంది. కైలాష్ అజిత్‌కు ఒక డీల్ లెటర్ పంపుతాడు. వివిధ కోసం కైలాష్ పనులపై కోపం వచ్చినప్పటికీ అజిత్ దానిపై సంతకం చేస్తాడు. అజిత్ అందరి ముందు అజిత్ డైరీ ఫార్మ్ నిర్మించి తన అల్లుడు అవుతాడని కైలాశ్ కు సవాలు చేస్తాడు.అజిత్ సుజాతకు నచ్చచెప్తాడు. తను ఎప్పుడూ అజిత్ భార్య కాదని వివిధ చెబుతుంది. ఆమె తనను ప్రేమిస్తున్నట్లు అజిత్ రుజువు చేస్తాడు. అజిత్ భూపుజ కోసం సుజత కైలాశ్ ను ఆహ్వానిస్తుంది. చెత్త డబ్బాల నుండి చెత్త అంతా పోసి కైలాశ్ ఆ స్థలాన్ని పాడుచేస్తాడు. వివిధ అక్కడికి వచ్చి కుంకుం మీద నడుస్తుంది. వివిధ తన భూమిపై కాలు పెట్టడంతో తన భూపూజ పూర్తయిందని అజిత్ చెబుతాడు. సుజాత బహుమతి రూపంలో వివిధకు గాజులు ఇస్తుంది అయితే వాటిని తీసుకోవటానికి ఆమె తిరస్కరించింది. అజిత్ ఆమె ఇంటికి వెళ్లి ఆ గాజులను ఆమెకు అందజేస్తాడు. కైలాశ్ నకిలీ కేసులో పోలీసుల సహాయంతో అజిత్‌ను అరెస్టు చేయిస్తాడు. సుజాత తన ఇంటిని అమ్మి నగరం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. వివిధ, మార్కెట్లో, అజిత్‌ను కౌగిలించుకుని, తను వెళ్లిపోవడం తనకు ఇష్టం లేదని చెబుతుంది. కైలాశ్ వివిధను తిరిగి తన కొత్త ఇంటికి తీసుకువచ్చి చెంప మీద కొడతాడు. అజిత్ తిరిగి తన ఇంటికి వచ్చి, వారికి నివసించడానికి గోశాలా ఉందని వెల్లడిస్తాడు. కైలాశ్ అజిత్, సుజాతాను చెడ్డ మాటలతో నిందిస్తాడు. వివిధ ముందు అజిత్ కైలాశ్ కాలర్ను అజిత్ పట్టుకుంటాడు. వివిధకు కోపం వచ్చి అజిత్ ని చెంపమీద కొడుతుంది. అజిత్ తన కొత్త ఇంటిని పెయింట్ చేస్తాడు. మరుసటి రోజు వివిధ యొక్క విచారకరమైన ముఖాన్ని చూడలేనందున తనను క్షమించమని కైలాష్‌ను అజిత్ అభ్యర్థిస్తాడు. వివిధ తప్ప అందరూ అతన్ని క్షమిస్తారు. కైలాష్ అజిత్ ఇంటికి, తన భవనానికి మధ్య ఒక సరిహద్దును గీస్తాడు, అతను శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తీయాలని నిర్ణయించుకుంటాడు. సుజాత, మిగిలిన కశ్యప్‌లు అతనిని వారించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అతను అలా చేస్తే అతను పాపి అవుతాడు. కానీ కైలాశ్ వారి మాట వినకుండా విగ్రహాన్ని తొలగించమని ఆదేశిస్తాడు. వివిధ దుర్గదేవి విగ్రహాన్ని, శ్రీకృష్ణుడి విగ్రహంతో పాటు అక్కడకు తెస్తుంది. వివిధ సుజాత పువ్వులను ఉంచి వారిని ఆశీర్వదించమని శ్రీ కృష్ణుడిని అడుగుతుంది. వివిధ అజిత్, సుజాతలకు ఆహారాన్ని తెస్తుంది, ఎందుకంటే ఆమె కర్రలతో పొయ్యి మీద సుజాత వంట చెయ్యడం చూడలేకపోయింది. రాత్రి, అజిత్ వివిధను తన వైపుకు లాగి, అతనిని క్షమించమని అడుగుతాడు, కాని వివిధ మళ్ళీ తిరస్కరిస్తుంది. వివిధ అతిథులను స్వాగతించడానికి ఏర్పాట్లు చేస్తుంది. అజిత్ ఇందూమతి (వివిధ నాన్నమ్మ) తో సరసాలాడుతూ అతిథుల గురించి తెలుసుకుంటాడు. కైలాశ్ యొక్క చిన్ననాటి స్నేహితుడు భద్రీ, తన కుమారుడు చింటుతో కలిసి కైలాశ్ ఇంటికి వస్తాడు. అజిత్ చింటును అనుమానిస్తాడు. కైలాశ్ తన కొత్త ఇంటి కోసం ఒక గ్రోప్రవేశం వేడుకను ఏర్పాటు చేస్తాడు. వివిధ చక్కగా అలంకరించుకుంటుంది. చింటు వివిధకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందుకని ఆమె బయటకు వస్తుంది. వివిధ షామయనపై కాలేసి కింద పడుతుంది. వివిధకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అజిత్, ఆమె వైపు పరుగెత్తాడు కాని అతని కాలు బెనికి వివిధపై పడతాడు. అజిత్ ఆమెను రక్షించడానికి తనపై "దిష్టి చుక్కను" పేడతాడు. చిన్నును ప్రేమిస్తున్నాడని చింటు చిన్నూని తప్పుదారి పట్టిస్తాడు. చిన్నూ తన మాటలను నమ్ముతుంది, ఇద్దరూ కారులో ఎక్కుతారు. అజిత్ వారిని చూస్తాడు. అతను చింటుతో గొడవ ప్రారంభిస్తాడు. చిన్ను, చింటు ఇద్దరూ తెలివిగా అతని నుండి తప్పించుకుంటారు. కైలాశ్ క్రూరమైన మాటలతో అజిత్‌ను తిడతాడు. వివిధ కారణంగా అజిత్ కైలాష్ ను విడిచిపెడతాడు. ఆ రాత్రి, అజిత్ ఒక నిచ్చెన ఎక్కి వివిధ బాల్కనీలోకి వస్తాడు. తాను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని అవిత్ వివిధతో చెప్తాడు మొదటిది: అతన్ని క్షమించమని అతను ఆమెను అడుగుతాడు. తను ముందే అతన్ని క్షమించానని వివిధ చెపుతుంది., రెండవది: చింటుకు క్రూరమైన మనస్సు ఉందని ఆయన చెప్పారు. తనకు దూరంగా ఉండమని చెప్పాడు., మూడవది: అతను ఆమెను ముద్దు పెట్టమని అడుగుతాడు. చిన్నూ, చింటు రహస్యంగా కలుస్తారు. అతనికి ముద్దు ఇవ్వమని అడిగినప్పుడు వివిధ భయపడతుంది. అప్పుడు అజిత్ ఆమె ముద్దు పెట్టవలసిన ఫైల్ను చూపిస్తాడు. ఇంతలో కైలాశ్ వివిధ గదిలోకి వస్తాడు. వివిధ ముద్దు పెట్టి లోపలికి వెళ్లిపోతుంది. మరుసటి రోజు, వివిధ అజిత్‌ను కుళాయి వద్ద స్నానం చేస్తున్నప్పుడు చూస్తుంది. అజిత్ వివిధను ఏడిపిస్తాడు. కైలాష్ దాసు గారిని అజిత్ ఫైల్స్ ను దొంగలించమని పంపిస్తాడు. అజిత్ అందరి ముందు రేపు తన డైరీ ఫర్మ్ మొదలవుతుందని, రేపే వివిధ తనతో నిశ్చితార్థం చేసుకుంటుందంటాడు. కైలాష్ తను వొడిపోయాడని చిరాకు పడతాడు. చింటు చిన్నుని అర్ధరాత్రి కార్లో ఎక్కించుకుని పుష్కర్ కు తీసుకువెళతాడు. ఇంకా అక్కడ పోలీసులు పట్టుకోగా ఇద్దరూ పారిపోతారు. మరోపక్క వివిధ, ఉమ, ఇందుమతి చిన్నూ కనబడటం లేదని గాబరా పడతారు. వివిధ చింటును అనుమానిస్తుంది. వివిధ అజిత్ తనకి చింటు మంచివాడు కాదని చెప్పినా తను నమ్మలేదని బాధపడుతుంది. అటు చింటు చున్నుని వదిలేస్తాడు. ఇంకా తనను ఎందుకు వదిలేసావు అని చిన్ను అడగగా తనని కొడతాడు. అప్పుడు అజిత్ చింటుని కొట్టి చిన్నూని ఇంటికి తీసుకువెళతాడు

చూపించని కథ

మార్చు

చాలా పోరాటాలు ఎదుర్కొన్న తరువాత, అజిత్, వివిధా వివాహం చేసుకుంటారు. వారు వివాహం చేసుకున్నప్పటికీ, కైలాశ్ రహస్యంగా సమస్యలను సృష్టించటం కొనసాగిస్తాడు. అజిత్, కైలాశ్ మధ్య పోరాటం తరువాత, కైలాష్ తనను తాను కాల్చుకుని చనిపోతాడు. ఆ తరువాత, అజిత్, వివిధా, సుజాత, కశ్యప్ వారి పిల్లలు మాధవ్, ఖుషీలతో కలిసి "నిజమైన ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది" అని నిరూపిస్తారు.

ప్రధాన తారాగణం

మార్చు
సంఖ్య. నటించిన వారి పేరు పాత్ర వరుసలు
౧. విక్రమ్ సింగ్ చహాన్ అజిత్ సుజాత {కథానాయకుడు} సుజాత - రమాకంత్ ల కుమారుడు ; వివిధ భర్త ; ఉమా కైలాశ్ ల అల్లుడు.
౨. శివాని సుర్వే వివిధ సుజాత {కథానాయకురాలు} కైలాశ్, ఉమ ల పెద్ద కుమార్తె ; అజిత్ భార్య ; సుజాత కోడలు.
౩. శిల్పా తులస్కర్ సుజాత {కథానాయకుడి తల్లి} అజిత్ తల్లి ; వివిధ అత్తయ్య ; రమాకాంత్ మొదటి భార్య.
౪. వినీత్ కుమార్ కైలాశ్ కశ్యప్ {ప్రధాన విరోధి} వివిధ, చిన్నూ, అంకిత్ ల తండ్రి ; ఉమ భర్త.

తారాంగణం

మార్చు
సంఖ్య. నటించిన వారి పేరు పాత్ర వరుసలు
౧. అపర్ణ గోషల్ ఉమ కశ్యప్ వివిధ, చిన్నూ, అంకిత్ ల తల్లి ; కైలాశ్ భార్య.
౨. ప్రశాంత్ భట్ట్ రమాకాంత్ వశిష్ట్ [చనియోయారు] సుజాత, సుమన్ ల భర్త ; అజిత్, రావిష్ ల తండ్రి; వివిధ మామయ్య[2].
౩. నిధి శాహ్ చిన్నూ (శ్వేత) కశ్యప్ కైలాశ్, ఉమ ల చిన్న కుమార్తె ; వివిధ, అంకిత్ ల చెల్లెెలు.
౪. సులక్షణ ఖత్రీ ఇందుమతి కశ్యప్ కైలాశ్ తల్లి ; ఉమ అత్త గారు ; వివిధ, చిన్నూ, అంకిత్ ల నానమ్మ.
౫. రుస్లాన్ సయెద్ అంకిత్ కశ్యప్ కైలాశ్, ఉమ ల కుమారుడు ; వివిధ, చిన్ను ల తమ్ముడు[3].
౬. మక్సూద్ అక్తర్ అబ్దుల్ చాచా సుజాత, అజిత్ ల పొరుగు వాడు, సహాయకుడు.

ఇతర తారాగణం

మార్చు
  • రవీశ్ గా శశాంక్‌ వ్యాశ్‌
    • రామకాంత్ , సుమన్ కుమారుడు
  • సుమన్ రమాకాంత్ వశిశ్ట్ గా స్మితా బన్సాల్
    • రవిష్ , అదితి తల్లి
  • చింటు గా పర్వేజ్ మాగ్రే
    • కైలాశ్ మిత్రుడైన భద్రి కొడుకు; వివిధ, చిన్నూ, అంకిత్ ల బాల్య స్నేహితుడు[4]
  • బ్రిగేడియర్ జనరల్ గా సురేంద్ర పాల్
    • రవిష్ తాత
  • విపుల్‌ గా మన్మోహర్‌ తివారి
    • రవీశ్ బంధువు (విరోధి)[5]
  • భూమి గా భవాని పురోహిత్
    • విపుల్ భార్య.
  • అదితి గా సనా సాయెద్
    • సుమన్ రమాకాంత్ ల కూతురు, రవేశ్ చెల్లెలు [6]
  • కాళింది వశిష్ట్ గా ఆరాధన ఉప్పల్
    • విపుల్ తల్లి , రమాకాంత్ చెల్లెలు

గరళ కళాకారులు

మార్చు
సంఖ్య. పేరు గరళం అందించిన పాత్ర పాత్ర వరుసలు
౧. శ్రీనివాస సాయి అజిత్ {కథానాయకుడు} సుజాత రమాకాంత్ ల కొడుకు, వివిధ భర్త .
౨. శ్రీ వల్లి సుజాత అజిత్ తల్లి ; వివిధ అత్తయ్య ; రమాకాంత్ మొదటి భార్య
౩. విజయ లక్ష్మి ఇందుమతి కశ్యప్ కైలాశ్ తల్లి ; ఉమ అత్త గారు ; వివిధ, చిన్నూ, అంకిత్ ల నానమ్మ.
౪. రామ చంద్రా రావు అబ్దుల్ చాచా సుజాత, అజిత్ ల పొరుగు వాడు , సహాయకుడు.

పురస్కారాలు

మార్చు
సంఖ్య. సంవత్సరం అవార్డుల పోటీ విభాగం గ్రహిత ఫలితం
౧. ౨౦౧౬ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు చెడు పాత్రలో ఇష్టమైన నటుడు వినీత్ కుమార్ గెలిచారు[7]
౨. ఇష్టమైన పాత్ర విక్రమ్ సింగ్ చౌహాన్ ఎంపికైనారు[8]
౩. ఇష్టమైన పురుష నటుడు
౪. ౨౦౧౭ ఇష్టమైన ధారావాహిక జానా నా దిల్ సే దూర్
౫. స్టార్ పరివార్ అవార్డులు ఇష్టమైన జంట శివాని సుర్వే , విక్రమ్ సింగ్ చౌహాన్

ఈ ప్రదర్శన "జానా నా దిల్ సే దూర్" అనే హిందీ సీరియల్ నుండి డబ్ చేయబడింది. అధిక ప్రజాదరణ కారణంగా, ఛానెల్ తెలుగు భాషలో డబ్ చేసి ప్రసారం చేయాలని నిర్ణయించింది.

ఇతర భాషల్లో

మార్చు
సంఖ్య. భాష పేరు ఛానెల్‌ ఎపిసోడ్ల సంఖ్య కాలం ఎక్కడ చూడాలి
౧. హిందీ (మొదటిగా ప్రసారమైయింది) జానా నా దిల్ సె దూర్‌ స్టార్ ప్లస్ ౪౧౮ ౨౦౧౬ మే ౯ - ౩౦ జూన్‌ ౨౦౧౭ హాట్ స్టార్
౨. మలయాళం మౌనం సమ్మతం ౩ ఏసియానెట్‌ ౨౨౯ ౨౦౧౬ డిసెంబరు ౧౨ - ౨౦౧౭ సెప్టెంబరు ౭ హాట్‌ స్టార్‌
౩. ఇండొనేశియా సెలమన్య సింత సూర్య సిత్ర టెలివిజన్‌ (సమాచారం లేదు) (సమాచారం లేదు) విడియొ
౪. ఉర్దూ డోంట్‌ గో ఎవే ఫ్రమ్ మై హార్ట్ (సమాచారం లేదు) (సమాచారం లేదు) (సమాచారం లేదు) యూట్యూబ్‌

స్పందన

మార్చు

ప్రదర్శనకు తెలుగులో మంచి స్పందన వచ్చింది. ఈ ధారావాహిక ౧౬౬ ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. కథ తీవ్ర మలుపు తిరిగినందుకు ఈ ధారావాహిక ముగిసింది. అన్ని ధారావాహికలకు ౧౨ రేటింగ్ వస్తే ఈ ధారావాహికకు ౧౩+ రేటింగ్ వచ్చింది. (ఇది హాట్ స్టార్ లో పొందుబరిచి ఉంది)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "> topic Web results JNDSD in Telugu channel | Jane Na Dil Se Door". www.indiaforums.com.
  2. "Prashant Bhatt: Once an actor, always an actor". Times of India. 16 Jul 2016. Retrieved 17 Jul 2016.
  3. "From behind the camera to acting, Ruslaan's dream comes true". Tellychakkar. 3 April 2016. Retrieved 27 July 2016.
  4. "Meet the Chintu of Jana Na Dil Se Door". Just-Showbiz. 25 July 2016. Archived from the original on 26 ఆగస్టు 2016. Retrieved 27 July 2016.
  5. "Swayamvar Contestant in Jana Na Dil Se Dur". Asian Age. Retrieved 4 May 2016.
  6. Team, Tellychakkar. "Jaana Na Dil Se Door sees a new entry". Retrieved 24 February 2017.
  7. mulla, zainab (December 3, 2016). "ita awards 2016 full winners list: divyanka tripathi dahiya, mouni roy, karan patel, rubina dilaik win top honours". india news, breaking news | india.com.
  8. Baddhan, Raj (May 12, 2017). "Star Parivaar Awards 2017: Full nominations list".

బాహ్య లింకులు

మార్చు

[1]