కొల్లూరి భాగ్యలక్ష్మి

(కె.బి.లక్ష్మి నుండి దారిమార్పు చెందింది)

కొల్లూరి భాగ్యలక్ష్మి తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. ఆమె విపుల మాసపత్రికలో పనిచేసింది.[1]

కొల్లూరి భాగ్యలక్ష్మి

జీవిత విశేషాలు

మార్చు

1953, ఆగస్టు 15న జన్మించిన కె.బి. లక్ష్మి వేటపాలెంలో చదువుకున్నది. అచ్యుతవల్లి కథలపై పీహెచ్‌డీ పూర్తిచేసింది.[2] 1965లో యువభారతి సాహిత్య సంస్థ వనితా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా పేరు గుర్తింపు పొందింది. ఆమె "మనసున మనసై", "జూకామల్లి" కథల సంపుటాలు వెలువరించింది. "వీక్షణం", "గమనం" కవితా సంకలనాలు కవయిత్రిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నది.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె కంచిలోని అత్తివరదర్ పెరుమాల్‌ దర్శనం కోసం వెళ్లి దర్శానానంతరం తిరుగు ప్రయాణంలో రైలు రేణిగుంట సమీపంలో గుండెపోటుకు గురై 2019 జూలై 29న మరణించింది.

మూలాలు

మార్చు
  1. ఈనాడు (29 July 2019). "ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 8 August 2019. Retrieved 8 August 2019.
  2. నమస్తే తెలంగాణ (30 July 2019). "ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి కన్నుమూత". www.ntnews.com. Archived from the original on 8 August 2019. Retrieved 8 August 2019.
  3. ప్రజాశక్తి (30 July 2019). "ప్రముఖ రచయిత్రి కె.బి.లక్ష్మి కన్నుమూత". www.prajasakti.com. Archived from the original on 2 August 2019. Retrieved 2 August 2019.

బాహ్య లింకులు

మార్చు